Advertisement
Google Ads BL

ఆర్ఆర్ఆర్ కు హీరోయిన్ ఝలక్


మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో భారీ మల్టీస్టార్రర్ మూవీ ఆర్ఆర్ఆర్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో బాలీవుడ్ భామ అలియా భట్, హాలీవుడ్ భామ డైసీ ఎడ్గర్ జోన్స్ హీరోయిన్లుగా నటించనున్నట్లు ఈ మధ్య జరిగిన ప్రెస్ మీట్ లో రాజమౌళి తెలియచేశారు.  ఈ చిత్రం ప్రస్తుతం రామ్ చరణ్ గాయం కారణంగా 3 వారాలపాటు షూటింగ్‌ను ఆపేశారు. ఈ విషయం చిత్ర యూనిట్ అఫీషియల్ గా తెలియచేసింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఆర్ఆర్ఆర్ యూనిట్ కు హాలీవుడ్ హీరోయిన్ షాకిచ్చింది. 

Advertisement
CJ Advs

ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన హీరోయిన్ గా నటిస్తున్న  డైసీ ఎడ్గర్ జోన్స్ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ చిత్రం నుండి తప్పుకుంది. ఈ విషయాన్నీ చిత్ర యూనిట్టే తెలిపింది. ‘‘కొన్ని అనివార్య కారణాల వల్ల డైసీ ఎడ్గర్ జోన్స్ ఆర్ఆర్ఆర్ చిత్రంలో చేయడం లేదు. ఆమెకు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాము.. ’’ అంటూ చిత్ర యూనిట్ అఫీషియల్ గా ప్రకటనను విడుదల చేసింది. 

దీంతో ఆర్ఆర్ఆర్ హీరోయిన్ల విషయంలో ఒకప్పుడు ఎలా అయితే చర్చ జరిగిందో అలాగే ఎన్టీఆర్ సరసన నటించే హీరోయిన్ ఎవరా అనే చర్చలు మొదలైనాయి. మరి రాజమౌళి ఈ హీరోయిన్ సంగతి ఎప్పుడు తేల్చుతాడో చూద్దాం.

Hollywood Heroine Jalak to RRR:

Daisy Edgar Jones out From RRR Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs