Advertisement
Google Ads BL

మహేష్ సినిమా నుంచి దిల్ రాజు అవుట్!


దిల్ రాజు కి ఎప్పటినుండో మహేష్ తో సోలో సినిమా చెయ్యాలని... అందుకే నిర్మాతగా మహర్షి సినిమాని దిల్ రాజు, వంశి పైడిపల్లి దర్శకత్వంలో సెట్ చేసుకున్నాడు. కానీ మధ్యలో అశ్వినీదత్, పీవీపీలు ఆ మహర్షి ప్రాజెక్టులో భాగస్వామ్యులయ్యారు. అలా దిల్ రాజు, మహేష్ సినిమాని సోలోగా నిర్మించాలనే కల కలగానే మిగిలిపోయింది. తాజాగా అనిల్ రావిపూడితో దిల్ రాజు, మహేష్ తో సినిమా కమిట్ చేయించాడు. ఇక్కడైనా దిల్ రాజు సోలోగా ప్రాజెక్ట్ చేపడదామంటే మహేష్, అనిల్ సుంకరిని తెచ్చి దిల్ రాజుకి తగిలించాడు. అలా దిల్ రాజు మళ్ళీ పార్ట్నర్ ని పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.

Advertisement
CJ Advs

ఇక అనిల్ రావిపూడితో దిల్ రాజు - అనిల్ సుంకరలు కలిసి మహేష్ సినిమాని భారీ బడ్జెట్ తో తెరకెక్కించనున్నారని ప్రచారం జరుగుతుంది. ఇక ఈ సినిమాకి మహేష్ 50 కోట్ల పారితోషకం అందుకుంటుండగా... దర్శకుడు అనిల్ రావిపూడి కూడా 12 కోట్ల పారితోషకం అందుకుంటున్నాడనే ప్రచారం జరిగింది. మరి దిల్ రాజు - అనిల్ సుంకరలు మహేష్ సినిమా మీద భారీగా పెట్టుబడి పెట్టడానికి రెడీ అయ్యారు. తాజాగా ఈ సినిమా జూన్ నుండి పట్టాలెక్కే ఛాన్స్ ఉందనే టాక్ మొదలైన క్షణంలో దిల్ రాజు ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లుగా ఫిలింనగర్ లో గుసగుసలు వినబడుతున్నాయి. దిల్ రాజు ఎందుకు ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడో కారణాలు తెలియరాలేదు కానీ.. ప్రస్తుతం అనిల్ రావిపూడి - మహేష్ ల కాంబో నిర్మాణ వ్యవహారాలు అనిల్ సుంకర చూసుకోనున్నాడని వార్తలు వస్తున్నాయి.

Dil Raju Jhalak to Super Star Mahesh Babu:

Dil Raju Out From Mahesh Babu Next film
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs