Advertisement
Google Ads BL

సూర్య.. కృతజ్ఞతను అభినందించాలి!


నేడు స్టార్స్‌ అనే వారు కూడా ఒకప్పుడు జీరోలుగా తమ ప్రస్థానం మొదలుపెట్టినవారే. వారికి కెరీర్‌ ప్రారంభంలో లిఫ్ట్‌ ఇచ్చిన వారు ఎందరో ఉంటారు. వారిలోని టాలెంట్‌ని, కసిని చూసి చాన్స్‌లు ఇచ్చిన వారిని ఆయా హీరోలు స్టార్స్‌గా మారిన తర్వాత మర్చిపోతారు. చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ నుంచి ఎందరో విజయబాపినీడు, జయకృష్ణ, కోదండరామిరెడ్డి, కె.యస్‌.రామారావు, శివప్రసాద్‌రెడ్డి, కోడిరామకృష్ణ, ఎస్‌.గోపాల్‌రెడ్డి వంటివారిని పక్కనపెట్టినవారే. ఈ విషయంలో టాలీవుడ్‌ స్టార్స్‌ కంటే కోలీవుడ్‌ స్టార్స్‌ ఎక్కువ కృతజ్ఞతగా ఉంటారు. తనని పరిచయం చేసిన కె.బాలచందర్‌కి కష్టసమయంలో రజనీకాంత్‌ రెండు మూడు చిత్రాలు చేశాడు. 

Advertisement
CJ Advs

ఇక విషయానికి వస్తే దేశం గర్వించదగ్గ దర్శకుడు బాలా. ఆయన తీసిన ‘పితామగన్‌’(శివపుత్రుడు) ద్వారానే విక్రమ్‌, సూర్యల ప్రతిభ అందరికీ తెలిసింది. అలాంటి దేశం గర్వించదగ్గ సహజసిద్దమైన రా చిత్రాలు తీసే బాలాని తనకుమారుడు తెరంగేట్రం మూవీ ‘వర్మ’ ద్వారా విక్రమ్‌ దారుణంగా అవమానించాడు. తెలుగు ‘అర్జున్‌రెడ్డి’ రీమేక్‌ ‘వర్మ’ నుంచి బాలాని తొలగించాడు. 

ఇక సూర్య విషయానికి వస్తే ఆయనకు బాలాతో ఎంతో స్నేహం, గౌరవం ఉన్నాయి. అందుకే విశాల్‌, ఆర్య నటించిన ‘వాడువీడు’లో చిన్న కామియో పాత్ర కూడా చేశాడు. ‘పితామగన్‌’ ముందే ‘నందా’ అనే చిత్రం తీశాడు. తాజాగా బాలాకి అవమానం జరిగిన విధం చూసి సూర్య తీవ్ర మనస్థాపానికి గురయ్యాడట. దాంతో తాను నటిస్తున్న సెల్వరాఘవన్‌ ‘ఎన్జీకే’, కె.వి. ఆనంద్‌ ‘కాప్పన్‌’ తర్వాత బాలాతో ఓ చిత్రం చేయడానికి అంగీకారం తెలిపాడు. ఈ చిత్రం లైన్‌ ఓకే అయిందని, స్క్రిప్ట్‌ పూర్తి అయిన తర్వాత సినిమా పట్టాలెక్కడం ఖాయమంటున్నారు. ఈ చిత్రం ద్వారా మరలా తనలోని సత్తా ఏమిటో నిరూపించుకోవడానికి బాలాకి చాన్స్‌ ఇచ్చిన సూర్యని అభినందించకుండా ఉండలేం. 

Again Suriya and Bala Combo:

Suriya Signed One More movie in Bala Direction
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs