Advertisement
Google Ads BL

అల్లు అర్జున్ అభిమానులకు అదిరిపోయే న్యూస్


అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఇప్పటికే ‘జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ రెండు సినిమాల తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో హ్యాట్రిక్ మూవీగా తెరకెక్కనున్న చిత్రం ఇటీవలే ప్రారంభమైంది. ఓపెనింగ్ అయితే అయ్యింది కానీ, మధ్యలో సుకుమార్‌తో బన్నీ మూవీ అని ప్రకటన రావడంతో ఈ మూవీ ఎప్పుడు తెరపైకి వస్తుందో అనే విషయంలో క్లారిటీ లేకుండా పోయింది. ఓపెనింగ్ తర్వాత ఈ మూవీకి సంబంధించి ఎటువంటి సమాచారం చిత్రయూనిట్ ఇవ్వలేదు. అయితే ప్రస్తుతం వినిపిస్తున్న వార్తలన్నింటికి చెక్ పెడుతూ.. చిత్రయూనిట్ ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్‌ను విడుదల చేసింది.

Advertisement
CJ Advs

తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ నెల 24 నుంచి ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని.. ఈ మూవీలో అల్లు అర్జున్ లుక్ కూడా ఇప్పటి వరకు ఏ మూవీలో కనిపించనటువంటి డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తాడని అంటున్నారు. లుక్స్ విషయంలో ఇప్పటికే ఎన్నో రకాలుగా పరిశీలించిన టీమ్ చివరికి ఓ లుక్‌ని ఫైనల్ చేశారట. ఈ లుక్‌కు సంబంధించిన పోస్టర్‌ను అల్లు అర్జున్ పుట్టినరోజు కానుకగా ఏప్రిల్ 8న విడుదల చేయనున్నారని మెగా సన్నిహిత వర్గాల నుంచి తెలుస్తోంది. 

Good News to Allu Arjun Fans:

Allu Arjun and Trivikram Movie First look on April 8th
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs