Advertisement
Google Ads BL

టాలీవుడ్‌కి కళొచ్చింది..!


గత రెండు నెలలుగా పిల్లలకు పరీక్షలేమో కానీ.. థియేటర్స్ మాత్రం బోసిపోతున్నాయి. అన్ సీజన్ అంటూ సరైన సినిమాలేవీ విడుదల కాలేదు. ఇప్పుడు పిల్లలకు పరీక్షల సీజన్ ముగిసింది. చాలా స్కూల్స్ కి వేసవి సెలవులు కూడా మొదలైపోయాయి. మరి మార్చి ఎండ్ నుండే ఎండలు మండిపోతున్నాయ్. కాబట్టే చాలా స్కూల్స్ కి సెలవులు కూడా ప్రకటించారు. మరి ఈ వేసవి సెలవులు మొదలవడమే తరువాయి.. కాస్త పేరున్న, క్రేజున్న సినిమాలన్నీ వరసబెట్టి థియేటర్స్ లోకి దిగిపోతాయి. అందులో ఈ వేసవి సెలవుల్లో మొదటిగా థియేటర్స్ లోకి రాబోతున్న సినిమా నాగ చైతన్య - సమంతల మజిలీ సినిమా. ప్రస్తుతం మంచి అంచనాలతో బాక్సాఫీసు వేసవి సెలవులకు గ్రాండ్ గా వెల్కమ్ చెప్పబోతోంది. మరి ఈ సినిమా మీద ప్రేక్షకులు భారీ ఆశలే పెట్టుకున్నారు. మజిలీకి కాస్త టాక్ లేచిన చాలు.. ప్రేక్షకులు ఆ సినిమాని బంపర్ హిట్ చెయ్యడం ఖాయం. మరి చైతు - సమంత ప్రేక్షకుల ఆశలను ఎంతవరకు చేరుకుంటారో మరికొద్దిగంటల్లో తేలిపోతుంది.

Advertisement
CJ Advs

ఇక ఈ శుక్రవారం మజిలీ వస్తుంటే.. శనివారం ఉగాది కానుకగా ప్రేమకథా చిత్రం 2 విడుదలవుతుంది. సుమంత్ అశ్విన్, నందిత శ్వేత, సిద్ధి ఇద్నానీ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంపై అంచనాలు ఉన్నాయి. గతంలో సుధీర్ బాబు, నందిత జంటగా వచ్చిన ప్రేమకథా చిత్రం హర్రర్, కామెడీగా హిట్ అయ్యింది. అందుకే ఇప్పుడు ప్రేమకథా చిత్రం 2 పై అంచనాలు వచ్చాయి. ఇక తమిళం నుండి లక్ష్మి రాయ్ నటించిన మరో మూవీ కూడా ఈ వారమే తెలుగులో డబ్ అవుతుంది. ఏదైనా మజిలీ - ప్రేమకథా చిత్రం 2 ల మధ్య పోటీ ఉంటుంది.

Majili vs Prema Katha Chitram:

Tollywood Box Office: Majili, Prema Katha Chitram 2
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs