ఎప్పుడో 15ఏళ్ల కిందట విజయభాస్కర్ దర్శకత్వంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ రచయితగా వచ్చిన ‘మన్మథుడు’ చిత్రం నాగ్ కెరీర్‌లో ఓ క్లాసిక్‌గా చెప్పాలి. ఇంతకాలం తర్వాత దీనికి సీక్వెల్‌గా చిలసౌ దర్శకుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో నాగార్జున చేస్తున్నాడు. పోర్చుగల్‌లో షూటింగ్ షెడ్యూల్ కోసం ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ఇక ‘మన్మథుడు 2’ కేవలం టైటిల్‌కే సీక్వెలా? లేక సినిమా స్టోరీ కూడా సీక్వెల్‌గా ఉంటుందా? అనే దానిపై క్లారిటీ లేదు. రకుల్‌ప్రీత్‌సింగ్, లక్ష్మి, రావు రమేష్, బ్రహ్మానందం ‘లవంగం’ పాత్రని వెన్నెల కిషోర్‌లు పోషిస్తున్నారు. ఆర్‌ఎక్స్100 ఫేమ్ చైతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నాడు. దీనిని నాగార్జునతో పాటు జెమిని కిరణ్‌లు కలిసి నిర్మిస్తున్నారు.
ఈ చిత్రంలో లవ్, కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్‌తో పాటు యాక్షన్ సీన్స్ కూడా ఉన్నాయట. అయినా ‘మన్మథుడు 2’ అంటే అందరు హిలేరియస్ కామెడీని ఎక్స్‌పెక్ట్ చేస్తారు. మొదటి భాగం చేసిన మ్యాజిక్‌ని ఈ చిత్రం రిపీట్ చేస్తుందా? లేదా? అనే ఆసక్తి ఏర్పడుతోంది. ఇక తన ఆఫీస్‌లో పనిచేసే ఓ కుర్రాడికి నాగార్జున పెళ్లి జరిపించే సమయంలో ఓ యాక్షన్ సీన్ వస్తుందట. కానీ నాగ్ మాత్రం ఇలాంటివి యాక్షన్ సీన్స్ ద్వారా కాకుండా హిలేరియస్ మైండ్ గేమ్ ప్రకారం సీన్ ఉండాలని సూచించడంతో ఈ యాక్షన్ సీన్‌ని రాహుల్ రవీంద్రన్ పక్కనపెట్టాడని సమాచారం.
ఇక ఇందులో సమంత కూడా ఓ కామియో రోల్ చేయనుందని సమాచారం. మామగారు నటిస్తున్న చిత్రం కావడం, రాహుల్ రవీంద్రన్‌తో సమంతకి ఉన్న సాన్నిహిత్యం వంటివి సమంత ఒప్పుకోవడానికి కారణం అని తెలుస్తోంది. సమంత మద్దతుతోనే ‘చిలసౌ’ కూడా అన్నపూర్ణ స్టూడియోస్‌కి వెళ్లింది. పాత్ర చిన్నది... కామియో అయినా ఈ పాత్రకు ఎంతో ఇంపార్టెన్స్ ఉంటుందిట. మరో కామియో రోల్‌లో అమల కూడా నటిస్తుందని వార్తలు వస్తున్నాయి.
ఇక ఎన్నికల తర్వాత నాగార్జున ‘సోగ్గాడే చిన్నినాయనా’కి ప్రీక్వెల్ లేదా సీక్వెల్‌గా ‘బంగార్రాజు’ చిత్రం ప్రారంభించనున్నాడు. ఇందులో చిలిపి బంగార్రాజును మరలా తెరపై చూడవచ్చు. కాగా ఈ చిత్రం బంగార్రాజు ఆయన మనవడు మధ్య జరిగే అనుబంధంగా రూపొందనుందని తెలుస్తోంది. నాగ్ మనవడిగా నాగచైతన్య నటించనున్నాడు.