Advertisement
Google Ads BL

దివ్యవాణిపై మండిపడిన అలీ!


రోజురోజుకు ఎండలతో పాటు ఎన్నికల వేడి కూడా బాగా రాజుకుంటోంది. వైసీపీ, జనసేన, తెలుగు దేశం పార్టీ నాయకులు ఒకరిమీద మరొకరు విమర్శలు సంధిస్తున్నారు. తమ నోటికి వచ్చినట్లుగా నానా శాపనార్ధాలు పెడుతున్నారు. ఇక విషయానికి వస్తే టాలీవుడ్‌లో సీనియర్‌ కమెడియన్‌ అలీ. ఈయన జనసేనాని పవన్‌కళ్యాణ్‌కి వీరాభిమానే కాదు.. మంచి స్నేహితుడు కూడా. తనకి నటించే సమయంలో భయం వేస్తే పక్కనే అలీ ఉంటే ధైర్యంగా ఉంటుందని పలుసార్లు పవన్‌ స్వయంగా చెప్పుకొచ్చాడు. 

Advertisement
CJ Advs

ఇక అలీ విషయానికి వస్తే ఆయన తనకు ఎన్నికల్లో పోటీ చేసి మంత్రి పదవి చేపట్టాలని ఉందనే కోరికను చాలాసార్లు వినిపించాడు. అంతా ఆయన జనసేనలో చేరడం గ్యారంటీ అనుకున్నారు. అలీ కూడా అటు పవన్‌ని, ఇటు చంద్రబాబులను కూడా కలిసి చాలా సేపు రహస్యంగా మాట్లాడారు. కానీ అంతలోనే ఏమైందో ఏమో గానీ ఆయన వైసీపీ కండువా కప్పుకున్నాడు. పోనీ వైసీపీ అయినా అలీకి సీటు ఇచ్చిందా? అంటే లేదనే చెప్పాలి. ఇక అలీ స్వయాన మంచి వ్యక్తి. అప్పుడప్పుడు అడల్ట్‌ జోక్స్‌ వేస్తాడే గానీ ఆయన గుప్తదానాలు బాగా చేస్తూ ఉంటారు. ఎవరు కష్టాలలో ఉన్న తన వంతు సాయం అందిస్తాడు. 

ఇక విషయానికి వస్తే నిన్నటి బాపు బొమ్మ దివ్యవాణి ప్రస్తుతం టిడిపి పార్టీలో ఉంది. తాజాగా ఆమె మాట్లాడుతూ, అలీ ప్యాకేజీ తీసుకునే వైసీపీలోకి చేరాడని విమర్శలు సంధించింది. ఈ వ్యాఖ్యలపై అలీ కూడా ఘాటుగానే స్పందించాడు. ప్యాకేజీ తీసుకున్నట్లు మీరేమైనా చూశారా? లేక సెల్ఫీ తీశారా? టీడీపీలో చేరేందుకు మీరెంత ప్యాకేజీ తీసుకున్నారో చెప్పండి అని విరుచుకుపడ్డాడు. మొత్తానికి ఈ ఎన్నికల్లో రాజకీయనాయకుల వ్యాఖ్యలే కాదు.. సినీ పరిశ్రమకి చెందిన వారు కూడా ఘాటుగానే వ్యాఖ్యలు చేస్తూ వేడిని రాజేస్తున్నారు. 

Comedian Ali Fires on Divyavani:

Ali Strong Counter to Divyavani
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs