Advertisement
Google Ads BL

కథ రెడీ చేసిన క్రిష్.. హీరో ఎవరో?


ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు, మహానాయకుడు, బాలీవుడ్ మణికర్ణిక దెబ్బకి అడ్రెస్స్ లేకుండా పోయాడు క్రిష్. మణికర్ణిక అయినా క్రిష్ పరువు నిలబెడుతుంది అనుకుంటే... పిచ్చో ఎచ్చో మణికర్ణిక క్రెడిట్ మొత్తం కంగనా పట్టుకుపోయింది. ఇక టాలీవుడ్ లో ఎన్టీఆర్ బయోపిక్ చెత్త క్రెడిట్ మొత్తం క్రిష్ ఖాతాలోకే చేరింది. అందుకే గత రెండు నెలలుగా క్రిష్ అజ్ఞాతవాసం చేస్తున్నాడు. అయితే ఈ లోపు క్రిష్ ఒక బాలీవుడ్ మూవీని డైరెక్ట్ చేయబోతున్నాడని.. ఆ సినిమా స్క్రిప్ట్ లో క్రిష్ తలమునకలై ఉన్నాడనే టాక్ వినబడేసరికి.. బాలీవుడ్ లో మణికర్ణికతో ఎదురుదెబ్బ తిన్న క్రిష్ మళ్లీ అక్కడే నిలదొక్కుకునే ప్రయత్నాలు మొదలుపెడుతున్నాడని అన్నారు.

Advertisement
CJ Advs

అయితే క్రిష్ బాలీవుడ్ సినిమాకన్నా ముందుగా టాలీవుడ్ లో ఓ స్టార్ హీరోతో సినిమా చెయ్యాలని..... ఓ స్టార్ హీరో కోసం క్రిష్ ఇప్పటికే స్కిప్ట్ వర్క్ ని మొదలెట్టాడని అంటున్నారు. తన దగ్గర కథ పూర్తి స్థాయిలో సిద్ధమైతే.. ఆ కథతో ఓ స్టార్ హీరోని కలవడానికి క్రిష్ రెడీ అవుతున్నాడని... అయితే స్క్రిప్టు ప‌నులు ఓ కొలిక్కి రావ‌డానికి క‌నీసం నెల రోజులైనా ప‌డుతుంద‌ని తెలుస్తోంది. మరి స్క్రిప్ట్ పూర్తయ్యాకే క్రిష్ తన హీరో ఎవరో అనేది రివీల్ చేస్తాడంటున్నారు. మరి రెండు సినిమాల డిజాస్టర్స్ తో ఉన్న క్రిష్ గాలానికి ఏ స్టార్ హీరో చిక్కుతాడో.. అంటూ సోషల్ మీడియాలో సెటైర్స్ వేస్తున్నారు.

Who is The Krish Next Hero?:

Story Ready, Krish Waiting for Star Hero
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs