Advertisement
Google Ads BL

లెక్కల మాస్టర్ లెక్క తప్పుతోంది!


ఒకపక్క మహేష్ తో సినిమా అనుకుంటే... మహేష్ తో సినిమా ఆపేసాడు సుకుమార్. మరి సుకుమార్ - మహేష్ ల మైండ్ సెట్ కలవకపోవడంతోనే ఆ సినిమా ఆగినట్లుగా మహేష్ చెప్పాడు. కాని సుకుమార్ మౌనమే వహించాడు. అలాగే అనుకోకుండా అల్లు అర్జున్ తో సుకుమార్ భారీ సినిమాని అనౌన్స్ చేసాడు. అది ఇప్పుడప్పుడే పట్టాలెక్కేలా కనిపించడం లేదు. ఎందుకంటే ముందు అల్లు అర్జున్ కమిట్ అయిన త్రివిక్రమ్ సినిమా ఇంకా సెట్స్ మీదకెళ్ళలేదు. అయితే ఆ మధ్యలో సుకుమార్ చిన్న సినిమాలకు నిర్మాతగా మారిన విషయం తెలిసిందే. గతంలో కుమారి 21 ఎఫ్, దర్శకుడు వంటి సినిమాలను సుకుమార్ తన సుకుమార్ రైటింగ్ స్కిల్స్ మీద నిర్మించాడు.

Advertisement
CJ Advs

అయితే తాజాగా సుకుమార్ సొంత బ్యానర్ లో త్వరలో ప్రారంభం కానున్న సినిమాలు ఆగిపోయే పరిస్థితిలో ఉన్నాయనే న్యూస్ ఫిలింనగర్ లో జోరుగా చక్కర్లు కొడుతోంది. గీతా ఆర్ట్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మించనున్న చిత్రానికి సూర్య ప్రతాప్ దర్శకుడు. ఈ సినిమాకి నితిన్ హీరో అనుకుంటే.. నితిన్ డేట్స్ కేటాయించలేను అని చెప్పాడట. అలా ఆ సినిమా అటకెక్కింది. తాజాగా మరో హీరో కూడా సుకుమార్ కి హ్యాండ్ ఇచ్చాడనే టాక్ నడుస్తుంది. 

నాగశౌర్య హీరోగా శరత్ మరార్ తో సుకుమార్ రైటింగ్స్ కలిపి కాశీ విశాల్ దర్శకత్వంలో చెయ్యాలనుకున్న చిత్రం కూడా మూలన పడేలా కనిపిస్తుంది. స్వయానా సుకుమార్ ఈ సినిమాని కూడా ఆపేయ్యాలనుకుంటున్నాడట. మరి దర్శకుడిగానూ, ఇటు నిర్మాతగానూ సుకుమార్ బాగా బ్యాడ్ పొజిషన్ లో కనిపిస్తున్నాడు. రంగస్థలం లాంటి గొప్ప సినిమాకి డైరెక్షన్ చేసిన సుకుమార్ కి టైం అస్సలు బాగోలేదు.

After Mahesh, Small Heroes Jhalak to Sukumar:

Sukumar, Naga Sourya Movie Shelved
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs