Advertisement
Google Ads BL

మణిరత్నం ఆఫర్‌కి విజయ్ నో..!


టాలీవుడ్‌లో ఒకప్పుడు హీరోయిన్లు అంటే ఖచ్చితంగా బాపు, కె.విశ్వనాథ్‌, రాఘవేంద్రరావు వంటి వారి చిత్రాలలో నటించాలనుకునేవారు. హీరోలు దాసరి, కోదండరామిరెడ్డి, రవిరాజా పినిశెట్టి, కోడిరామకృష్ణ... ఇలాంటి వారితో పనిచేయాలని భావించేవారు. ఇక నేడు హీరోయిన్లు అంటే కృష్ణవంశీ, హీరోలు అంటే రాజమౌళిలతో నటించేందుకు పోటీ పడుతున్నారు. 

Advertisement
CJ Advs

విషయానికి వస్తే దేశంలోని నటీనటులు ఎవరైనా ది లెజెండరీ డైరెక్టర్‌, క్రియేటివ్‌ జీనియస్‌ మణిరత్నం చిత్రంలో నటించాలని భావిస్తుంటారు. ఇక మణిరత్నం ఈ మధ్య ఫామ్‌ కోల్పోయినా కూడా ‘ఓకే బంగారం, నవాబ్‌’ చిత్రాలతో మరలా తన సత్తా చాటేందుకు కృషి చేస్తున్నాడు. ఇందులో భాగంగా ఆయన మరో మల్టీస్టారర్‌ చిత్రానికి ప్లాన్‌ చేస్తున్నాడు. ఇందులో కూడా ‘నవాబ్‌’లో నటించిన విజయ్‌ సేతుపతిని ఓ హీరోగా తీసుకున్నాడు. 

కానీ ఇటీవల ‘నవాబ్‌, 96, సీతకత్తి, సూపర్‌డీలక్స్‌’ వంటి వరుస విజయాల తర్వాత విలక్షణ నటుడు విజయ్‌సేతుపతి చేతిలో దాదాపు అరడజను చిత్రాలు ఉన్నాయి. మణిరత్నం మాత్రం తన చిత్రానికి బల్క్‌డేట్స్‌ కావాలని కోరడంతో వరుస బిజీలో ఉన్న విజయ్‌ సేతుపతి విధిలేని పరిస్థితులలో ఈ చిత్రానికి నో చెప్పాడట. మణి చిత్రమే కాదనుకోవడం బాధాకరమే అయినప్పటికీ అంతకు మించిన అవకాశం లేకపోవడంతో విజయ్‌ నో చెప్పాడట. కాగా ప్రస్తుతం మణి.. విజయ్‌ సేతుపతి స్థానంలో మరో యంగ్‌స్టార్‌ని తీసుకోవాలనే వేటలోఉన్నాడు. ఆయన దృష్టి నాని, విజయ్‌దేవరకొండల మీద ఉన్నట్లు కోలీవుడ్‌ మీడియా కోడై కూస్తోంది. 

Vijay Sethupathi says no to Mani Ratnam Film:

Mani Ratnam Next film Details
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs