Advertisement
Google Ads BL

‘దూకుడు’ భామ మహేష్‌ ‘మహర్షి’లో!


మే9.. ఈ తేదీ కోసం సినీ ప్రియులు, మహేష్‌ అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. అందునా ఇది మహేష్‌కి మైల్‌స్టోన్‌ వంటి ఆయన 25వ ప్రతిష్టాత్మక చిత్రం కావడం విశేషం. ఇక ఈ చిత్రం థియేటికల్‌ బిజినెస్‌ 90కోట్ల వరకు జరిగిందని తెలుస్తోంది. ఇక ఇతరత్రా డిజిటల్‌, రీమేక్‌, డబ్బింగ్‌.. ఇలా అన్ని కలుపుకుంటే మరో 40కోట్లు వస్తాయట. ఈ లెక్కన ఈ చిత్రం పంపిణీదారులను సేఫ్‌గా బయటపడవేయాలంటే వందకోట్ల షేర్‌ని సాధించడం తప్పనిసరి. అంటే ‘మహర్షి’ చిత్రం ‘భరత్‌ అనే నేను’ కంటే పెద్ద హిట్‌ కావాల్సిన అవసరం ఉంది. ఇక ‘మహర్షి’ చిత్రంలో మీనాక్షిదీక్షిత్‌ కూడా నటిస్తోంది. ఈమె ఎవరంటే ‘దూకుడు’ చిత్రంలోని టైటిల్‌ సాంగ్‌లో ఈమె తళుక్కున మెరిసింది. మరలా ఇన్నేళ్ల తర్వాత మహేష్‌ చిత్రంలో మరోసారి నటిస్తోంది. ఈ సినిమాలో విదేశాలలో ఉండే ఎన్నారై మహేష్‌కి ఈమె కొలీగ్‌గా కనిపించనుందట. మెయిన్‌ హీరోయిన్‌ పూజాహెగ్డేనే అయినా ఇందులో మహేష్‌ , మీనాక్షి దీక్షిత్‌ల మధ్య కూడా కాస్త రొమాంటిక్‌ సీన్స్‌ ఉంటాయని సమాచారం. 

Advertisement
CJ Advs

మరి ఆమెకి, మహేష్‌కి ఎంత సేపు రొమాన్స్‌ ఉంటుందో వేచిచూడాల్సివుంది. ఇక తాజాగా ఈమె ఇందులో తాను నటిస్తున్న విషయాన్నిదృవీకరించింది. మహేష్‌బాబుతో పని చేయడం ఎంతో గొప్ప సూపర్‌ ఎక్స్‌పీరియన్స్‌. మహేష్‌ ప్రొఫెషలిజంకి తిరుగేలేదని కాంప్లిమెంట్‌ ఇచ్చింది. ఇక ఈ చిత్రంలో పూజాహేగ్డే, అల్లరినరేష్‌, మహేష్‌బాబులు స్నేహితుల్లా కనిపించనున్నారు. 

Dooduku actress in Mahesh Babu Maharshi:

Meenakshi Dixit Special Role in Maharshi
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs