Advertisement
Google Ads BL

‘మజిలీ’ స్టోరీలైన్ ఇదేనంటున్నారు!


తాజాగా అక్కినేని కోడలు సమంత నటించిన ‘సూపర్‌డీలక్స్‌’ చిత్రం తమిళంలో విడుదలైంది. బ్లాక్‌బస్టర్‌ హిట్‌గా ట్రేడ్‌ పండితులు, విమర్శకులు తేల్చిచెబుతున్నారు. విజయ్‌సేతుపతి ట్రాన్స్‌ జెండర్‌గా, రమ్యకృష్ణ మాజీ వేశ్యగా, సమంత ‘వింబు’ అనే నెగటివ్‌ ఛాయలున్న పాత్రలో నటించింది. ఈ చిత్రం పెద్ద విజయం సాధించడంతో సమంత ఎంతో ఆనందంగా ఉంది. మరోవైపు నాగచైతన్యతో పెళ్లికి ముందు ‘ఏమాయచేశావే, మనం, ఆటోనగర్‌ సూర్య’ చిత్రాలలో నటించిన టాలీవుడ్‌ క్యూట్‌ కపుల్‌ వివాహం అనంతరం కలిసి నటిస్తున్న తొలి చిత్రం ‘మజిలీ’ 5వ తేదీన విడుదల కానుంది. ‘నిన్నుకోరి’ దర్శకుడు శివనిర్వాణ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం టీజర్‌, ట్రైలర్స్‌ బాగా ఆకట్టుకుంటున్నాయి. గోపీసుందర్‌ కూడా మంచి ఫీల్‌ ఉన్న సంగీతం అందించాడు. 

Advertisement
CJ Advs

కాగా ఈ చిత్రానికి మంచి సూపర్‌హిట్‌ టాక్‌ వస్తే నాగచైతన్య కెరీర్‌లోనే భారీ విజయం నమోదు చేయడం ఖాయమనే టాక్‌ వస్తోంది. ఇలా ఈ చిత్రంపై అంచనాలు పెరిగిపోతున్నాయి. ప్రీరిలిజ్‌ బిజినెస్‌ 22కోట్లకు పైగానే జరిగింది. ఒక ఓవర్‌సీస్‌లో ఈ మూవీని 150 స్క్రీన్లలో విడుదల చేస్తున్నారు. తన మొదటి చిత్రం ‘నిన్నుకోరి’ చిత్రం క్లాస్‌ అని, కానీ ‘మజిలీ’ మాత్రం మాస్‌ అని దర్శకుడు శివనిర్వాణ అంటున్నాడు. ఈ చిత్రం సెన్సార్‌ కూడా పూర్తయింది. సెన్సార్‌వారు ‘యు/ఎ’ సర్టిఫికేట్‌ ఇచ్చింది. దీంతో ఇక ఈ మూవీ 5వ తేదీన విడుదల కావడమే మిగిలి ఉంది. 

ఇక ఈ చిత్రం స్టోరీలైన్‌ ఇదేనంటూ ఓ వార్త హల్‌చల్‌ చేస్తోంది.. క్రికెటర్‌గా ఉన్న ఓ యువకుడు అనుకోని కారణాల వల్ల ప్రేమించిన అమ్మాయికి దూరం కావడం, మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సి రావడం జరుగుతుంది. అలా పెళ్లి చేసుకోవడం వల్ల ఆ కుర్రాడు క్రికెట్‌కి దూరం అవుతాడు. ప్రేమలో ఫెయిల్‌ అయి, ఫస్ట్రేషన్‌తో ఏదోలా బతికేస్తున్న ఆ మనిషిని భార్య ఎలా భరించింది? ఎలా అతడిని మార్చుకుంది అనే ఇంట్రస్టింగ్‌ పాయింట్‌ ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. ‘సూపర్ డీలక్స్’ విజయం తర్వాత ఈ చిత్రం విజయంతో సమంతకు వరుసగా డబుల్‌ హిట్‌ రావడం ఖాయమంటున్నారు. 

Majili Movie Storyline Revealed:

Majili Movie Ready to Release
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs