Advertisement
Google Ads BL

అక్కడ తేల్చుకుంటాం: మోహన్ బాబు


కోర్టును త‌ప్పు దోవ ప‌ట్టించారు.. సెష‌న్స్ కోర్టులో తేల్చుకుంటాం - మంచు మోహ‌న్ బాబు

Advertisement
CJ Advs

ప్ర‌ముఖ‌ న‌టుడు, నిర్మాత మంచు మోహ‌న్‌బాబుకు హైద‌రాబాద్ ఎర్ర‌మంజిల్ 23 మెట్రోపాలిటిన్ స్పెష‌ల్ మేజిస్టేట్ కోర్టు ఏడాది పాటు శిక్ష‌ను ఖ‌రారు చేసింద‌ని వార్త‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో త‌న‌పై వ‌స్తున్న వార్త‌ల‌పై మోహ‌న్‌బాబు స్పందించారు. ఆయ‌న మాట్లాడుతూ.. ‘‘2009లో ‘స‌లీమ్’ సినిమా చేస్తున్న స‌మయంలో ఆ సినిమాకు సంబంధించిన మొత్తాన్ని ద‌ర్శ‌కుడు వైవిఎస్ చౌద‌రికి చెల్లించేశాం. మా బ్యాన‌ర్‌లోనే మ‌రో సినిమా చేయ‌డానికిగానూ ఆయ‌న‌కు రూ.40ల‌క్ష‌ల చెక్ ఇచ్చాం. ‘స‌లీమ్’ అనుకున్న స్థాయిలో విజ‌యం సాధించ‌క‌పోవ‌డంతో.. వైవిఎస్ చౌద‌రితో త‌దుప‌రి చేయాల్సిన సినిమాను వ‌ద్ద‌నుకున్నాం. సినిమా చేయ‌డం లేద‌ని వైవిఎస్ చౌదరికి చెప్పాం. అలాగే చెక్‌ను బ్యాంకులో వేయ‌వ‌ద్ద‌ని కూడా చెప్పాం. అయినా కూడా కావాల‌నే చెక్‌ను బ్యాంకులో వేసి చెక్‌ను బౌన్స్ చేశారు. నాపై చెక్ బౌన్స్‌ కేసుని వేసి.. కోర్టును త‌ప్పు దోవ ప‌ట్టించారు. దాంతో వారికి అనుకూలంగా తీర్పు వ‌చ్చింది. ఈ తీర్పుని మేం సెష‌న్స్ కోర్టులో ఛాలెంజ్ చేస్తున్నాం. కొన్ని చానెల్స్‌లో నాపై వ‌స్తున్న త‌ప్పుడు ఆరోప‌ణ‌ల‌ను న‌మ్మ‌వద్దు’’ అన్నారు.

Mohan Babu Reacted on 1 Year Imprisonment:

Clarification of Cheque bounce issue by Dr.M Mohan Babu
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs