మూడు డిజాస్టర్స్ తగిలేసరికి నితిన్ కి ఏం చెయ్యాలో పాలు పోవడం లేదు. శ్రీనివాస కళ్యాణం గత ఏడాది ఎప్పుడో విడుదలైంది. ఆ సినిమా డిజాస్టర్ కావడంతో నితిన్ మరో సినిమా మొదలెట్టడానికి జంకుతున్నాడు. ఛలో మూవీని లోబడ్జెట్ లో తెరకెక్కించి హిట్ కొట్టిన వెంకీ కుడుములతో నితిన్ భీష్మ సినిమా కమిట్ అయ్యాడు. ఎప్పటినుండో ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న భీష్మ సినిమా ఇంకా మొదలవలేదు. నితిన్ పుట్టిన రోజుకి ప్రీ లుక్, ఫస్ట్ లుక్ అంటూ పోస్టర్ హల్చల్ చేశాయి. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా ఎంపికైన రష్మిక మందన్న కూడా భీష్మ మొదలయ్యే క్షణాల కోసం ఎదురు చూస్తున్నట్లుగా చెప్పింది.
మరి ఎప్పుడో మొదలవ్వాల్సిన భీష్మ నితిన్ బర్త్ డేకి పట్టాలెక్కుతోంది అనుకుంటే.. తాజాగా భీష్మ సినిమా మొదలవడానికే మరింత సమయం పట్టేలా కనబడుతుంది. నితిన్ కి భీష్మ కథ మీద స్పష్టతకి రాకపోవడం.. వెంకీ స్క్రిప్ట్ లాక్ చేయకపోవడంతో భీష్మ సినిమా మొదలవడానికి టైం పడుతుందని.. ఈలోపు నితిన్ చంద్రశేఖర్ ఏలేటి సినిమాలో నటించనున్నాడట. ఆ సినిమా పూర్తయ్యాకే భీష్మ సినిమా మొదలవుతుందని తెలుస్తోంది.
మరి ఇది వెంకీ కుడుముల బ్యాడ్ లక్కే అని చెప్పాలి. ఛలో వంటి సాలిడ్ హిట్ తీసిన దర్శకుడు ఇంకా తన రెండో సినిమాని మొదలెట్టడానికి చాలాకాలంగా ఎదురు చూడాల్సిన పరిస్థితి. మరి నితిన్ కావాలనే చేస్తున్నాడా? లేదంటే నిజంగానే వెంకీ నితిన్ ని శాటిస్‌ఫై చెయ్యలేకపోతున్నాడో అనేది తెలియడం లేదు.