Advertisement
Google Ads BL

‘సీత’కు కాజల్ ప్లస్సా.. మైనస్సా?


ఇప్పటికి యంగ్ హీరోయిన్స్ కి గట్టి పోటీ ఇస్తున్న కాజల్ ని నిజంగానే అందరూ చందమామే అంటారు. ఇండస్ట్రీలోకి ఎంటరైనప్పటి నుండి అదే గ్లామర్ మెయింటింగ్ చేస్తున్న భామల్లో కాజల్ ముందు ఉంటుంది. ఇప్పటికి యుంగ్ హీరోల పక్కన హీరోయిన్ గా నటిస్తుంది అంటే... అందుకు ఆమె గ్లామర్ కారణం. పెళ్లి వయసొచ్చినా.. పెళ్లి పేరెత్తకుండా ఇంకా గ్లామర్ రోల్స్ లో దూసుకుపోతున్న కాజల్ కి ఇప్పుడు కాస్త షాక్ తగిలినట్లే కనబడుతుంది. తన తొలి దర్శకుడు తేజతో కాజల్ అగర్వాల్ ఆమధ్యన నేనే రాజు నేనే మంత్రి సినిమా చేసింది. రానా హీరోగా తెరకెక్కిన ఆ సినిమాలో కథ మొత్తం రాధ క్యారెక్టర్ చేసిన కాజల్ చుట్టూనే తిరుగుతుంది. అలాగే ఆ సినిమాలో అందమైన శారీస్ లో కాజల్ అగర్వాల్ అందాలు అదరహో అన్నట్టుగా ఉన్నాయి.

Advertisement
CJ Advs

తాజాగా తేజ డైరెక్షన్ లోనే కుర్ర హీరో బెల్లంకొండ శ్రీనివాస్ సరసన సీత సినిమా చేస్తుంది కాజల్. ఇంతకుముందే కవచం సినిమాలో నటించిన శ్రీనివాస్ - కాజల్ లు ఆ సినిమాతో డిజాస్టర్ అందుకున్నారు. మరి సీత సినిమాతో హిట్ కొడతారో లేదో ఏప్రిల్ 25 న గాని తేలదు. తాజాగా సీత టీజర్ ని విడుదల చేసింది చిత్ర బృందం. సీత టీజర్ లో చందమామ కాజల్ అగర్వాల్ కాస్త ఏజెడ్ హీరోయిన్ గా కనిపిస్తుంది. గ్లామర్ డ్రెస్ లో కనిపించినా ఏజెడ్ లుక్స్ మాత్రం కాజల్ అందాల్ని దెబ్బతీశాయి.

సీత సినిమా మొత్తం కాజల్ చుట్టూనే తిరుగుతున్నాడని..... ఇదో లేడి ఓరియెంటెడ్ టైప్ లోనే ఉండబోతుందనేది సీత టీజర్ లో తెలుస్తుంది. మరి ఈ సినిమాలో కాజల్ లుక్స్ పరంగా వయసు కొట్టొచ్చినట్టుగా అనిపిస్తుంది. యంగ్  హీరో శ్రీనివాస్ పక్కన కాజల్ ఇలా వయసు పైబడిన లుక్స్ లో తేలిపోతుందేమో అనిపిస్తుంది. చూద్దాం సీత సినిమాలో కాజల్ లుక్స్ ఎలా ఉంటాయో అనేది.

Kajal Agarwal Powerful Role in Sita Movie:

Comments on Kajal in Sita Movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs