Advertisement
Google Ads BL

‘మిస్టర్ లవంగం’గా ఈసారి బ్రహ్మీ కాదు


ప్రస్తుతం నాగార్జున తన కెరీర్ లోనే బెస్ట్ మూవీ అయిన మన్మధుడు సినిమాకి సీక్వెల్ చేస్తున్నాడు. చి.ల.సౌ రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్ లో నాగార్జున - రకుల్ ప్రీత్ జంటగా మన్మధుడు 2 సినిమా మొదలైంది. అయితే మన్మధుడు సినిమాలో నాగార్జున, సోనాలి బింద్రే, అంజు జంటగా నటించారు. ఇక ఆ సినిమాలో నాగార్జున - సోనాలి ఫ్రాన్స్ వెళ్ళినప్పుడు హాస్యనటుడు బ్రహ్మనందం లవంగం పాత్రలో చేసిన కామెడీ సినిమాకే హైలెట్. మన్మధుడు సినిమాతో నాగార్జునకి ఎంతగా పేరొచ్చిందో బ్రహ్మికి అంతే పేరొచ్చింది. లవంగంగా బ్రహ్మి రెచ్చిపోయి చేసిన కామెడీకి ఇప్పటికే బుల్లితెర మీద ప్రేక్షకులు ఆ సినిమాని ఎంతో ఇంట్రెస్ట్ తో చూస్తున్నారు. 

Advertisement
CJ Advs

అయితే తాజాగా మొదలైన మన్మధుడు 2 లో.. ప్రస్తుతం క్రేజ్ లేని బ్రహ్మి ప్లేస్ లోను మరో కమెడియన్ ఎంటర్ కాబోతున్నాడు. అదే అక్కినేని ఫ్యామిలీకి ఎంతో దగ్గరైన వెన్నెల కిషోర్. ఆనందో బ్రహ్మ, అమీ తుమీ చిత్రాలతో కమెడియన్ గా పేరు సంపాదించిన వెన్నెల కిషోర్ ఇప్పుడు నాగ్ పక్కన mr లవంగంగా కామెడీ చేయబోతున్నాడనే న్యూస్ వినబడుతుంది. ప్రస్తుతం నాగ్, కిషోర్‌ల మధ్య సన్నివేశాల రూపకల్పన జరుగుతోందని సమాచారం. మరి బ్రహ్మి - నాగ్ కాంబోలో పండిన హాస్యం.. వెన్నెల - నాగ్ కాంబోలో ఎంతవరకు పండుతుందో అనేది మన్మధుడు 2 డైరెక్టర్ చెప్పాలి. 

Vennela Kishore to replace Brahmanandam In Manmadhudu 2:

Manmadhudu 2: Shocking Replacement  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs