Advertisement
Google Ads BL

ప్రభాస్ సినిమా కోసం 18 సెట్స్..!


బాహుబలి ఎఫెక్ట్ తో ప్రభాస్ ఇప్పుడు తన సినిమాలన్నీ ఇంటర్నేషనల్ గా విడుదల చెయ్యడానికి ఉత్సాహం చూపిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో సినిమాలు తెరకెక్కిస్తూ అన్ని భాషలను టార్గెట్ చేస్తున్నాడు. ఇప్పటికే సుజిత్ డైరెక్షన్ లో సాహో సినిమాతోనూ, రాధాకృష్ణ సినిమాతోనూ ఇండియా వైడ్ గా  తన సినిమాలను విడుదల చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సాహో సినిమా షూటింగ్ ఒక కొలిక్కి రావడంతో ప్రభాస్ ఇప్పుడు రాధాకృష్ణతో చెయ్యబోయే సినిమా షూటింగ్ కి హాజరవుతున్నాడు. పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా భారీ బడ్జెట్ తో భారీగా తెరకెక్కుతుంది. అయితే ఈ సినిమా ఈ ఏడాది చివరిలో విడుదలవుతుందని చెప్పిన.. వచ్చే ఏడాది సంక్రాంతి బరిలోనే ఈ సినిమా ఉండబోతుందనేది లేటెస్ట్ న్యూస్.

Advertisement
CJ Advs

కారణం ప్రియాడికల్ ప్రేమకథగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసమే భారీ సెట్స్ అవసరమవడంతో.. ఆ సెట్స్ నిర్మాణానికి చాలా సమయం పట్టడంతోనే సినిమా షూటింగ్ లేట్ అవుతుందట. తాజాగా ప్రభాస్-రాధాకృష్ణ సినిమా కోసం 18 సెట్స్ నిర్మించబోతున్నారని.. ఇప్పటికే అన్నపూర్ణ స్టూడియోస్ లో నాలుగు సెట్స్ నిర్మాణం పూర్తి కూడా అయ్యిందనేది టాక్. ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ ఎస్‌.ర‌వీంద‌ర్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో ఈ భారీ సెట్స్ ని నిర్మిస్తున్నారట. ఈ సినిమా మొత్తం రోమ్ నేప‌థ్యంలో జ‌రిగే క‌థ‌ కాబట్టి కొంత భాగం తెర‌కెక్కించారు. ఇక అక్కడి వాతారవరణానికి మ్యాచింగ్‌గా ఇండోర్ సీన్ల‌ని హైద‌రాబాద్‌లోనే తెర‌కెక్కిస్తున్నారు. అందుకోసమే ఈ భారీ సెట్స్ నిర్మాణం అట. 

అయితే ఈ 18 సెట్స్ నిర్మాణం ఖర్చు దాదాపు 60 నుంచి 70 కోట్ల వ‌ర‌కూ ఉంటుంద‌ని టాక్‌. మరి హీరోయిన్ సెట్ కోసమే అన్నపూర్ణ స్టూడియోస్ లో నాలుగు కోట్ల ఖర్చు పెట్టినట్లుగా తెలుస్తుంది. అందుకే మిగతా సెట్స్ నిర్మాణానికి భారీగానే ఖర్చు పెడుతున్నారట ఈ సినిమా నిర్మాతలు. మరి బాహుబలి ఎఫెక్ట్ ప్రభాస్ తదుపరి సినిమాల మీద ఎలా పడిందో ఆ సినిమాలకు పెడుతున్న బడ్జెట్ చెప్పేస్తుంది కదూ..!

Prabhas Film: 18 sets to show Rome in Hyderabad:

Prabhas Brings Rome To Hyderabad  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs