తనకు ఫీజు రీయంబర్స్‌మెంట్ రాలేదనే కక్ష్యతో తాజాగా సినీ నటుడు మోహన్‌బాబు వచ్చే ఎన్నికల్లో జగన్‌కి ఓటేయమని చెబుతూ చంద్రబాబుపై పరుష పదజాలం వాడాడు. ఇంతకాలం మౌనంగా ఉన్న ఆయన తాజాగా తన నోరువిప్పాడు. విజయవాడలోని వైసీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మరలా టిడిపి అధికారంలోకి వస్తే ఇసుక, మట్టి అన్ని దోచేస్తారు. ‘ఫినిష్ చంద్రబాబు పార్టీ.. నో మోర్ చంద్రబాబు పార్టీ’.. తెలుగుదేశం పార్టీని నమ్ముకున్నవారికి ఈ టర్మ్ మీకు చాన్స్ లేదు. ఒకవేళ జగన్‌మోహన్‌రెడ్డి సరిగా పాలన చేయకపోతే వచ్చే ఎన్నికల్లో అవకాశం వచ్చినా చంద్రబాబుకి మాత్రం ఇవ్వవద్దు.
అన్న ఎన్టీఆర్ కుటుంబంలోని వారు అమాయకులు. అందుకే వారిని చంద్రబాబు మోసం చేస్తున్నాడు. ఏపీ అభివృద్ది కోసం కేంద్రం ఇచ్చిన నిధులను చంద్రబాబు దోచేశారు. లెక్కలు చెప్పకుండా తప్పించుకుంటున్న దొంగ ఆయన అని మోహన్‌బాబు ద్వజమెత్తాడు. మరి రాబోయే రోజుల్లో మోహన్‌బాబు మరింతగా చంద్రబాబుపై విమర్శలు కురిపించడం ఖాయమనే చెప్పాలి. కానీ మోహన్‌బాబుని నమ్మి, ఆయన మాటలకు విలువ ఇచ్చే వారు ఎవరా? అనేది మాత్రం సందేహమే.