Advertisement
Google Ads BL

మహేష్ చెప్పింది మరిచిపోను: సమంత


నాగ చైతన్య - సమంత పెళ్లి చేసుకుని భార్య భర్తలయ్యారు. పెళ్ళికాకముందు సినిమాల్లో నటించిన ఈ జంట పెళ్లి తర్వాత మజిలీ సినిమాలో నటించింది. చైతు - సామ్ నటించిన మజిలీ సినిమా ఏప్రిల్ 5న వరల్డ్ వైడ్‌గా విడుదలవుతుంది. ప్రస్తుతం ఈ జంట మజిలీ ప్రమోషన్స్ లో పాల్గొంటుంది. ఇక చైతు మీద జోక్స్ వేస్తూ సమంత మజిలీ ప్రమోషన్స్ ని పీక్స్ కి తీసుకెళ్లడమే కాదు.. పర్సనల్ విషయాలతో పాటుగా సినిమా ముచ్చట్లను పంచుకుంటుంది. ఇక తాజాగా సామ్ చెప్పిన ఒక విషయం ఇప్పుడు వైరల్ అయ్యింది. 

Advertisement
CJ Advs

అదేమిటంటే చైతు చెప్పినదానికన్నా మహేష్ చెప్పిన మాటకే సమంత ఎక్కువ విలువనిస్తుందట. మరి మహేష్‌తో దూకుడు వంటి బ్లాక్ బస్టర్ చిత్రంలో నటించిన సమంత ‘బ్రహ్మోత్సవం’ వంటి డిజాస్టర్ లోను నటించింది. ఇక సమంత కెరీర్ విషయంలో చైతు  క‌న్నా మ‌హేష్‌బాబు మాటనే వేదంగా తీసుకుంద‌ట‌. దూకుడు సినిమా షూటింగ్‌లో మ‌హేష్‌బాబు.. సమంతకి కెరియ‌ర్ విష‌యంలో కొన్ని టిప్స్ ఇచ్చాడ‌ట‌. ఆ టిప్స్ ఏమిటంటే మనం నటించే ప్ర‌తి సినిమాని మొద‌టి సినిమాగా భావించి క‌ష్ట‌ప‌డాలి అని చెప్పాడ‌ట‌. టాప్ స్టార్ మయ్యామని ఎప్పుడు రిలాక్స్ అవ్వకూడదని... మహేష్ చెప్పిన మాటలు ఎప్పటికి గుర్తుండిపోవడం చేతనే తాను కెరీర్ లో ఇలా ఉన్నానని చెప్పింది.

అలాగే కెరీర్ మొదట్లో మాస్ అండ్ గ్లామర్ రోల్స్ కి ఓకే చెప్పినా.. మెల్లగా సమంత ఇప్పుడు ప్రాధాన్యత ఉన్న పాత్రలలోనే మెరుస్తుంది. ఒక స్టేజ్ కొచ్చాక ప్రతి సినిమా చెయ్యాలనే రూల్ లేదు. అలాగే అవకాశాలు కోసం వెంపర్లాడాల్సిన పని లేదు కనకనే నటనకు ప్రాధాన్యమున్న పాత్రలకే ఓకే చెబుతున్నానని చెబుతున్నది ఈ అక్కినేని వారి కోడలు.

Samantha Reveals Top Secret about Mahesh Babu:

Samantha Speech at Majili Movie Promotions
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs