Advertisement
Google Ads BL

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’: వైసీపీ చెప్పినట్లు వర్మ ఆడాడు


ఏదో పడదోసేస్తాను, ఎవరినో విలన్ ని చేస్తాను, నేను చెప్పినవన్నీ నిజాలే. వారి గురించి ప్రజలకి తెలియజేస్తాను అంటూ బయలుదేరిన రామ్ గోపాల్ వర్మకి ఏపీ హై కోర్ట్ ఝలక్ ఇస్తే.. క్రిటిక్స్ ఇంకాస్త మొట్టికాయలు వేశారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ తో పగలదీస్తాను అంటూ బయలుదేరిన వర్మకి ప్రేక్షకులు కూడా షాకిచ్చారు. నిన్న శుక్రవారం వరల్డ్ వైడ్(ఏపీ తప్ప) గా విడుదలైన వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ కి ప్లాప్ రివ్యూస్ ఇచ్చారు రివ్యూ రైటర్స్. అంతేకాకుండా ప్రేక్షకులు కూడా లక్ష్మీస్ ఎన్టీఆర్ చూసి పెదవి విరిచారు. ఎందుకంటే అన్ని బైయోపిక్స్ లాగే వర్మ కూడా తనకి తెలిసినదానికన్నా.. భజనకే ప్రాముఖ్యతనిచ్చాడు. 

Advertisement
CJ Advs

లక్ష్మీస్ ఎన్టీఆర్ లో లక్ష్మీ పార్వతిని హైలెట్ చేయడమే కాదు.. ఆమె ఓ గొప్ప నీతివంతురాలు అన్నట్టుగా చూపించడం, ఎన్టీఆర్ ఆ వయసులోనూ లక్ష్మీపార్వతితో రొమాన్స్ చేయడం, లక్ష్మీ పార్వతిని మంచిగా చూపించడం ప్రేక్షకులు జీర్ణించుకోలేరు. అలాగే అప్పట్లో పార్టీలో లక్ష్మీపార్వతి కారణంగా అసమ్మతి రాజుకుందన్నది జగమెరిగిన సత్యం. లక్ష్మీపార్వతి దూరమై, ఆమె భర్త వీరగంధం సుబ్బారావు మీడియాకు ఎక్కి, ఆమెపై, ఎన్టీఆర్ పై విమర్శలు కురిపించారన్నది జరిగిన సంగతి. పార్టీ చీలిన తరువాత, అధికారం పోయిన వెంటనే లక్ష్మీపార్వతి రాజకీయంగా బహిరంగంగానే వ్యవహరించిన సంగతి అంతకన్నా వాస్తవం. లక్ష్మీపార్వతి అమాయకురాలు. ఎన్టీఆర్ అంటే ఆమెకు దైవంతో సమానం. కేవలం ఎన్టీఆర్ చరిత్ర రాయడానికి ఆమె ఆయన దగ్గరకు వచ్చింది. ఎన్టీఆర్ ఆమెపట్ల ఆకర్షితుడై పెళ్లి చేసుకున్నాడు. ఆమె ఏనాడూ తెలుగుదేశం పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేదు... అన్నట్టుగా చూపిస్తే ప్రేక్షకుడు ఒప్పుకోవాలిగా... అసలు లక్ష్మీపార్వతి పత్తిత్తు అన్నట్టుగా వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ లో చూపించడం, ఎన్టీఆర్ రాజకీయాలకు దూరమవడానికి... చాలామంది కారణమైతే కేవలం చంద్రబాబే కారణమని చూపించడం చూస్తే వర్మ కావాలనే చంద్రబాబు మీద కత్తికట్టి.. ఈ ఎన్నికల్లో బాబుని టార్గెట్  చెయ్యడానికే వైసిపి శ్రేణులు వర్మని వాడుకున్నట్టుగా అడుగడుగునా కనిపిస్తుంది.

ఇక చంద్రబాబు పాత్రని ఎంతగా విలన్ గా చూపించాలో అంతగా చూపించే ప్రయత్నంలో.. ప్రతి ఫ్రేమ్‌లోనూ కెమెరా అతనిపైనే ఫోకస్‌ పెట్టి, ఎప్పుడూ మైండ్‌లో ఏదో ప్లాన్‌ రన్‌ చేస్తున్నవాడిగా చూపించడం చూస్తే చిరాకు అనిపిస్తుంది. సినిమాలో పాటలు... అసలెందుకు అన్ని పాటలు పెట్టారో ఎవ్వరికి అర్ధం కాదు. అర్ధం పర్థం లేని పాటలతో విసుగు తెప్పించాడు. మరి నిజాలు నిర్భయంగా చెబుతానంటూ లక్ష్మీస్ ఎన్టీఆర్ తీసిన వర్మని మీడియా, క్రిటిక్స్ అందరూ వాడేసుకుంటున్నారు. క్వాలిటీ లేని నిర్మాణ విలువలు, ఎన్టీఆర్ - లక్ష్మీపార్వతిల ప్రేమ కలాపాలు ఇవన్నీ చెత్తగా ఉన్నాయంటున్నారు. అందుకే ఇప్పుడు చెప్పు వర్మ ఏం చెబుతావో అంటున్నారు.

No Truth in Lakshmis NTR Movie:

Varma Follows YSRCP Footsteps
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs