Advertisement
Google Ads BL

నయనతారకు ఊహించని ఝలక్..!


తమిళనాట నయనతారను లేడీ సూపర్ స్టార్ అంటారు అని అందరికి తెల్సిందే. అక్కడ ఆమె క్రేజ్ అంత ఇంత కాదు. కోలీవుడ్ లో కొంతమంది హీరోస్ కంటే నయనతార ఎక్కువ పారితోషికం తీసుకుంటది. అయితే ఏదిపడితే అది చేస్తే మాత్రం చెల్లదు. లేటెస్ట్ గా నయన్ నటించిన సినిమా ఒకటి ఆమెకు డిజాస్టర్ తెచ్చిపెట్టింది.

Advertisement
CJ Advs

తొలిసారిగా నయన్ ద్విపాత్రాభినయం చేసిన ఐరా సినిమా థియేటర్లలోకి వచ్చింది. హారర్, థ్రిల్లర్ నేపథ్యంలో సాగిన ఈ సినిమాను ఏదేదో ఊహించుకున్నారు. కానీ అందులో ఒకటి పూర్తిగా డీ-గ్లామరైజ్డ్ రోల్. దానికి తోడు చెత్త స్క్రీన్ ప్లే... నాసిరకమైన కథ అవ్వడంతో మొదటిరోజే నయనతారకు ఎదురుదెబ్బ తగిలింది.

కోలీవుడ్ మీడియా మొత్తం ప్రస్తుతం ఈ సినిమాను దుమ్మెత్తిపోసింది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే నయనతారపై ఉన్న క్రేజ్ కారణంగా తమిళనాట ఈ సినిమాకు భారీ ఓపెనింగ్స్ వచ్చాయి. మొదటి రోజు కాబట్టి ఓపెనింగ్స్ వస్తాయి. ఇంక రెండోరోజు నుండి టాక్ బయటకి వచ్చేస్తుంది కాబట్టి ఈ సినిమాను ఆదరించడం కష్టమే. సో ఇకనైనా నయన్ స్టార్ డమ్ ను దృష్టిలో పెట్టుకోకుండా, కథ-స్క్రీన్ ప్లే పరంగా సినిమాలు సెలక్ట్ చేసుకుంటే బెటర్ అని అంటున్నారు.

Superb Shock to Lady Superstar Nayanthara:

Airaa failed at Box Office
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs