Advertisement
Google Ads BL

ఒక్క ట్రైలర్‌తో లారెన్స్ అంచనాలు పెంచేశాడు


దక్షిణాది సినీ ప్రముఖుల్లో బహుముఖ ప్రజ్దాశాలి, ఆల్‌రౌండర్‌ అనే బిరుదు ఖచ్చితంగా రాఘవ లారెన్స్‌కి దక్కుతుంది. మొదట్లో గ్రూప్‌ డ్యాన్సర్‌గా, ఆ తర్వాత కొరియోగ్రాపర్‌ గా, ఐటం సాంగ్స్‌, స్పెషల్‌ సాంగ్స్‌లో డ్యాన్స్‌ చేస్తూ, నిర్మాతగా, నటునిగా, దర్శకునిగా కూడా తన సత్తా చాటుతూ ఉన్నాడు. ఈయన నాగార్జున హీరోగా అన్నపూర్ణ బేనర్‌లో చేసిన ‘మాస్‌’ చిత్రం మంచి విజయం సాధించింది. ఆ తర్వాత ‘డాన్‌, స్టైల్‌, రెబెల్‌’ వంటి చిత్రాలను తీశాడు. అయినా ఆయన సత్తా ‘కాంచన’ సిరీస్‌ చాటిచెప్పింది. దక్షిణాదిన హర్రర్‌ కామెడీ చిత్రాలు ఊపందుకునేందుకు ఈ చిత్రం కారణమైంది. 

Advertisement
CJ Advs

‘ముని, కాంచన, గంగ’ చిత్రాలతో పాటు తాజాగా ‘కాంచన 3’లో లారెన్స్‌ ఒకేసారి తెలుగు, తమిళ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. లారెన్స్‌ స్వీయదర్వకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఏప్రిల్‌ 19న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రం ట్రైలర్‌ని విడుదల చేశారు. సస్పెన్స్‌, హర్రర్‌, యాక్షన్‌ సన్నివేశాలతో ఈ ట్రైలర్‌ని కట్‌ చేశారు. నెరసిని గడ్డం, మీసాలతో కాస్త వయసు మళ్లిన లుక్‌లో లారెన్స్‌ కనిపిస్తూ ఉండటం విశేషం. దాదాపు సాల్ట్‌ అండ్‌ పెప్పర్‌లుక్‌లా ఇది ఉంది. ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ లారెన్స్‌ సరికొత్తగా కనిపిస్తోన్న ఈ లుక్కే అనడంలో సందేహం లేదు. ఈ చిత్రంలో బలమైన ప్రతి నాయకునిగా కబీర్‌ దుహాన్‌సింగ్‌ నటిస్తున్నాడు. నువ్వా నేనే అన్నట్లు పోటా పోటీగా ఈ చిత్రంలో లారెన్స్‌, కబీర్‌ దహాన్‌సింగ్‌ పాత్రలు ఉంటాయట. 

ఈ చిత్రంలో వేదిక, ఓవియా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఈ చిత్రం గురించి లారెన్స్‌ మాట్లాడుతూ, ‘కాంచన 3’ అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా ఉంటుంది. నేరుగా తెలుగులో హీరోగా చేయాలనే ఉద్దేశ్యంతోనే కథలు తయారు చేసుకుంటున్నాను. గతంలో రెండు సార్లు దర్శకునిగా అవకాశం ఇచ్చిన నాగార్జున గారితో ఓ చిత్రం చేయాలని ఉంది. మొదటి నుంచి నన్ను ప్రోత్సహిస్తూ వచ్చిన మెగాస్టార్‌ చిరంజీవి గారిని కూడా డైరెక్ట్‌ చేయాలనేది నా ఆశయం.. అని చెప్పుకొచ్చాడు. గతంలో లారెన్స్‌ ‘స్టైల్‌’ చిత్రంలో కూడా చిరు, నాగ్‌లు క్షణాల పాటు తెరపై కనిపించిన విషయం తెలిసిందే. 

Click Here for Trailer

Raghava Lawrence Kanchana 3 Trailer Released:

Craze Hiked with Kanchana 3 Trailer
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs