ఈ సమ్మర్ కి రిలీజ్ అయ్యే సినిమాల్లో పెద్ద సినిమా మహర్షి ఒక్కటే. మిగిలినవి అన్ని మీడియం అండ్ లోబడ్జెట్ సినిమాలే. అయితే మహర్షి సినిమా రిలీజ్ డేట్ కూడా ప్రకటించేసారు. మహర్షి సినిమా టేబుల్ లాస్ తో విడుదల కాబోతున్నట్లు ఇండస్ట్రీ వర్గాల బోగట్టా. దానికి కారణం సినిమాకి బడ్జెట్ ఎక్కువ అవ్వడమే. ఈ సినిమాకి దాదాపుగా 135 నుంచి 140 కోట్ల ఖర్చు అయిందని నిర్మాత దిల్ రాజు చెబుతున్నట్లు తెలుస్తోంది.
అంత మొత్తం వెనక్కి రావాలంటే చాలా కష్టం. ఇప్పటికి నలభై కోట్లకు పైగా నాన్ థియేటర్ రైట్స్ నుంచి వచ్చింది. ఆంధ్ర ఏరియాను 38 కోట్ల రేషియోలో డీల్ సెట్ అయిందని టాక్. సీడెడ్ వాళ్లకి 15 కోట్లు చెబుతున్నారని టాక్. మహేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన భరత్ అనే నేను సినిమా 13 కోట్లకు పైగా మొత్తానికి సీడెడ్ కు అమ్మితే పదికోట్లు రావడం కష్టమయింది. సో అందుకే 15 కోట్లు అంటే సీడెడ్ బయ్యర్స్ ఆలోచిస్తున్నారు.
ఎలాగో నైజాం దిల్ రాజు తీసుకుంటారు కాబట్టి ఇక్కడ సమస్య ఏమి ఉండదు. ఓవర్సీస్ వాళ్లకి 12 కోట్లు చెబుతున్నారు కానీ ఎవరు ముందుకు రావడం లేదు. ఇక కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా వుంటాయి. కర్ణాటక నుంచి పదికోట్ల వరకు ఆశిస్తున్నారు. రెస్టాఫ్ ఇండియా ఓ అయిదు కోట్లు అంచనా. ఈ 135 నుంచి 140 కొట్లో మహేష్ రెమ్యూనరేషన్ కూడా ఉంది. సో మహేష్ తన రెమ్యూనరేషన్ తగ్గించకపోతే ఫ్యూచర్ లో ఆయనతో సినిమాలు చేసే నిర్మాతలు తగ్గిపోతారని కామెంట్లు వినిపిస్తున్నాయి . ఇంత బడ్జెట్ అవ్వడానికి కారణం మరొకటి కూడా ఉంది. రీషూట్స్ అవ్వడం. మరోపక్క ఈసినిమాపై మహేష్ అండ్ దిల్ రాజు కాన్ఫిడెంట్ గానే ఉన్నారు కానీ టీం మరో విషయంలో భయపడుతున్నారు. సినిమా రన్ టైం 3 గంటలు వచ్చిందట. మూడు గంటలు సినిమా అంటే టాక్ అద్భుతంగా ఉంటే తప్ప జనాలు సినిమాని చూడటానికి థియేటర్స్ కి కూడా రారు.