నా పేరు సూర్య సినిమా తరువాత అల్లు అర్జున్ ఇంతవరకు తన నెక్స్ట్ సినిమాని స్టార్ట్ చేయలేదు. మరి లేట్ అవుతుందనేమో వరసబెట్టి సినిమాలు ఓకే చేస్తున్నాడు బన్నీ. త్రివిక్రమ్ కాంబినేషన్ లో ప్రస్తుతం ఓ సినిమా చేయబోతున్నాడు. త్వరలోనే ఈసినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.
అలానే సైలెంట్ గా సుకుమార్ తో ఓ సినిమా ఓకే చేసేసాడు. ఈ రెండింటి మధ్యలో మరో సినిమాకు ఓకె చెప్పేసాడు. అది కూడా ఫుల్ బౌండ్ స్క్రిప్ట్ రెడీగా వుండడం విశేషం. దిల్ రాజు బ్యానర్ లో ఈసినిమా ఉండబోతుంది. స్క్రిప్ట్ మొత్తం విన్న బన్నీ వెంటనే ఓకే చేసేసాడట. ఈసినిమాను వేణు శ్రీరామ్ టేక్ ఓవర్ చేస్తున్నాడు.
ఓ మై ఫ్రెండ్, ఎంసిఎ సినిమాల తరువాత వేణు శ్రీరామ్ ఈ స్క్రిప్ట్ మీద చాలాకాలం నుండి వర్క్ చేస్తున్నాడు. సుకుమార్ ప్రాజెక్టు లేట్ అవుతుంది కాబట్టి, బన్నీ ఆ గ్యాప్ లో ఈ సినిమాను ఫినిష్ చేయడానికి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. అంటే అప్పుడువరకు సుకుమార్ ఆగాల్సిందేనా? ఇవే కాకుండా విక్రమ్ కుమార్ తో ఒక సినిమా... మురుగదాస్ తో ఓ సినిమా చేయనున్నాడు.