Advertisement
Google Ads BL

మళ్లీ మహేష్‌తోనే ఈ తమిళ హీరో పోటీ


తమిళంలో వచ్చి విజయం సాధించిన విజయ్‌ ఆంటోని చిత్రం ‘బిచ్చగాడు’ తమిళంలో కంటే తెలుగులోనే పెద్ద విజయం సాధించింది. పెద్ద స్టార్స్‌ నటించిన చిత్రాలతో కలిసి వచ్చిన ఈ మూవీ స్టార్‌ చిత్రాలను తలదన్ని ఘనవిజయం సాధించి, ఈ చిత్రాన్ని విడుదల చేసిన నిర్మాతలకు కనకవర్షం కురిపించింది. నిజానికి సంగీత దర్శకుడైన విజయ్‌ ఆంటోని హీరోగా మారి అతి తక్కువ చిత్రాలతోనే కోలీవుడ్‌లోనే కాదు.. టాలీవుడ్‌లో కూడా క్రేజ్‌ సాధించాడు. 

Advertisement
CJ Advs

కానీ ‘బిచ్చగాడు’ తర్వాత ఆయన నటించిన ఏ చిత్రం కూడా ‘బిచ్చగాడు’ స్థాయి విజయాన్ని సాధించలేకపోయాయి. ‘సైతాన్‌, యమన్‌’ వంటి ఎన్నో చిత్రాలు నిరాశపరిచాయి. అయినా ఇప్పటికీ విజయ్‌ ఆంటోని చిత్రం విడుదల అవుతుంది అని తెలిస్తే అందులో ఏదో ఒక కొత్తదనం ఉంటుందనే నమ్మకం మాత్రం ప్రేక్షకులలో ఉంది. ఇక ప్రస్తుతం విజయ్‌ ఆంటోని నటించిన మరో చిత్రం తెలుగులోకి అనువాదమవుతోంది. తమిళంలో ‘కొలైగారన్‌’ టైటిల్‌తో విజయ్‌ ఆంటోని నటించిన చిత్రం తెలుగులోకి ‘కిల్లర్‌’ పేరుతో విడుదల కానుంది. ఈ సినిమాలో యాక్షన్‌కింగ్‌ అర్జున్‌ ఓ కీలకపాత్రలో నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా ఆడియోని విడుదల చేశారు. 

అండ్రూ లూయిస్‌ దర్శకత్వం వహించిన ఈ మూవీలో ఆషిమా నర్వాల్‌ హీరోయిన్‌గా యాక్ట్‌ చేసింది. వేసవి కానుకగా ఈ చిత్రాన్ని మే నెలలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ‘బిచ్చగాడు’ తర్వాత ఆ స్థాయి హిట్‌ పడని విజయ్‌ ఆంటోని ‘కిల్లర్‌’పై ఎన్నోఆశలు పెట్టుకుని ఉన్నాడు. ‘బిచ్చగాడు’ కూడా మహేష్‌ నటించిన ‘బ్రహ్మోత్సవం’కి పోటీగా వచ్చి విజయం సాధించింది. మరి ‘కిల్లర్‌’ కూడా ‘మహర్షి’ టైంలోనే వచ్చి విజయం సాధిస్తుందా? లేదా? అనేది చూడాలి. 

కాగా గతంలో ‘కిల్లర్‌’ టైటిల్‌తో ఫాజిల్‌ దర్శకత్వంలో నాగార్జున, నగ్మా, శారదలు నటించిన చిత్రం మంచి విజయం సాధించింది. మరి ఇప్పుడు విజయ్‌ ఆంటోని ‘కిల్లర్‌’ ఎలాంటి ఫలితం అందిస్తుందో వేచిచూడాల్సివుంది! 

Vijay Antony Film Killer vs Mahesh Babu Maharshi:

Killer Movie Audio Released
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs