Advertisement

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’.. అక్కడ పరిస్థతి ఏంటి?


ఎన్నో సమస్యలను, అడ్డంకులను దాటుకుని లక్ష్మీస్ ఎన్టీఆర్ రేపు శుక్రవారం వరల్డ్ వైడ్‌గా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాని విడుదల కాకుండా ఎలాగైనా ఆపాలని టిడిపి వారు సకల ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదో సెన్సార్ దగ్గర ఆగుతుంది అనుకున్నోళ్లకి.. నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్లుగా.. క్లీన్ యు తో లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలకు సెన్సార్ బోర్డు క్లియరెన్స్ ఇచ్చింది. రామ్ గోపాల్ వర్మ ఎత్తుగడలు ఫలించి లక్ష్మీస్ ఎన్టీఆర్ ఫైనల్‌గా రేపు వరల్డ్ వైడ్‌గాను.. ఈ రోజు సాయంత్రం ఓవర్సీసీ లో ప్రీమియర్స్ తోనూ విడుదలకాబోతుంది. 

Advertisement

రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా కోసం కాచుకుని కూర్చున్నారు. అందుకే లక్ష్మీస్ ఎన్టీఆర్ టాక్ తో సంబంధం లేకుండా ఫస్ట్ డే ఓపెనింగ్స్ భారీగా ఉంటాయని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే మంచి బిజినెస్ చేసిన లక్ష్మీస్ ఎన్టీఆర్ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి ఓపెనింగ్స్ రాబట్టినా... ఓవర్సీస్ ప్రీమియర్స్ తో ఎంత కొల్లగొడుతుందో అంటూ ఇప్పుడు అందరూ ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో భారీ బిజినెస్‌తో టేబుల్ ప్రాఫిట్ తో ఉన్న లక్ష్మీస్ ఎన్టీఆర్ నిర్మాతలకు ఇక్కడి కలెక్షన్స్ కి ఢోకా లేదని.. ఎందుకంటే ఏపీ ఎన్నికల ఫలితంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ కి మాంచి క్రేజ్ ఉందని.. అందుకే ఇక్కడ కలెక్షన్స్ లెక్క కాదని.... కానీ ఓవర్సీస్ కలెక్షన్స్ ఎలా ఉంటాయో అంటున్నారు. ఓవర్సీస్ లో వీకెండ్ సినిమా సంస్థ లక్ష్మీస్ ఎన్టీఆర్ భారీ మొత్తానికి రైట్స్ తీసుకుని ఈ సినిమాని రిలీజ్ చేస్తోందని తెలుస్తోంది. అయితే ఓవర్సీస్ లో కీలకమైన యుఎస్ లో దాదాపు 125 పైగా లొకేషన్లలో వీకెండ్ సినిమా సంస్థ ఈ లక్ష్మీస్ ఎన్టీఆర్ ని రిలీజ్ చేస్తుండడం అనేది ఇప్పుడు హాట్ టాపిక్.

మరి ప్రీమియర్స్‌తోనే భారీగా లాభ పడాలని వీకెండ్ సినిమా సంస్థ యోచనలా కనిపిస్తుంది. మరి సినిమాకి నెగెటివ్ టాక్ పడినా.. లక్ష్మీస్ ఎన్టీఆర్ లో ఏముందో అనే క్యూరియాసిటీతో ప్రేక్షకులు థియేటర్స్ కి రావడం మాత్రం పక్కా అంటూ ఆర్జీవీ నమ్మకంగా ఉన్నాడు. ఎలాగూ సెన్సార్ వారు కూడా సినిమాకి పాజిటివ్ సర్టిఫికెట్ ఇవ్వడం.. ఈ సినిమాకి ప్లస్ అంటూ వర్మ ప్రచారం చేస్తున్నాడు కూడా.

What is situation in Lakshmis NTR Overseas Market?:

Lakshmis NTR Ready to Release
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement