Advertisement
Google Ads BL

ఈ స్టార్ హీరోకి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్


కన్నడ స్టార్ హీరో సుదీప్... ఇప్పుడు కోర్టు మెట్లెక్కక తప్పేలా కనబడడం లేదు. కన్నడలో సూపర్ స్టార్ అయిన సుదీప్ తెలుగు, తమిళ భాషల్లోను అనేక సినిమాల్లో నటించాడు. తెలుగులో రాజమౌళి ఈగ సినిమాలో విలన్ గా అదరగొట్టేసాడు. తాజాగా బాలీవుడ్ దబాంగ్ సీక్వెల్ లోను నటిస్తున్న సుదీప్‌కి ఒక కేసు మెడకు చుట్టుకుంది. అయితే ఆ కేసులో కోర్టు‌కి హాజరవకుండా తప్పించుకుని తిరుగుతున్న సుదీప్ ఇప్పుడు తప్పకుండా కోర్టు మెట్లెక్కాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే చిక్‌మంగళూరు JMFC కోర్ట్ సుదీప్ ఒక్కసారి కూడా కోర్టుకి హాజరు కాకపోవడంతో... సుదీప్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఇంతకీ సుదీప్ కోర్టు కథ, కేసు కథ ఏమిటంటే....

Advertisement
CJ Advs

కర్ణాటక చిక్‌మంగళూరులోని కాఫీ ప్లాంటేషన్ ఓనర్ దీపక్ పటేల్ సుదీప్ పై ఈ కేసు పెట్టాడు. కన్నడ టీవీ రియాలిటీ వారసదార అనే షో కోసం తన ప్రాపర్టీని, కాఫీ తోటల్ని ధ్వంసం చేసిన కారణంగా ఆ కాఫీ ఎస్టేట్ ఓనర్ కేసు వేసాడు. ఆ షో డైరెక్టర్ మహేష్ అండ్ నటుడు సుదీప్ తన తన కాఫీ తోటల్ని, మరికొంత ప్రాపర్టీని ధ్వంసం చేశారని.. దానివలన కోటిన్నర లాస్ అని ఆయన కేసు వెయ్యగా... మధ్య వర్తిత్వంతో ఆ కేసు సెటిల్మెంట్ చేసుకుందామనుకుంటే... కాఫీ ప్లాంటేషన్ ఓనర్ దీపక్ పటేల్ మాత్రం ససేమిరా అనడం, ఆ కేసు విచారణకు వచ్చినప్పుడల్లా.. సుదీప్ కోర్టుకి హాజరవకుండా తప్పించుకుని తిరగడంతో... చిక్‌మంగళూరు JMFC కోర్ట్ సుదీప్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.

ఎలాగైనా సుదీప్‌ని పట్టుకుని కోర్టులో హాజరుపరచాలని కోర్టు పోలీసులను ఆదేశించింది. మరి చివరికి సుదీప్ కోర్టు మెట్లెక్కాల్సి వచ్చేలా కనబడుతుంది.

Non-Bailable Arrest Warrant On Star Hero:

Coffee estate case: Chikkamagaluru court issues warrant for Kichcha Sudeep
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs