Advertisement
Google Ads BL

క్రిష్ ఎక్కడ పోయిందో.. అక్కడే ట్రై చేస్తున్నాడు


దర్శకుడు క్రిష్ ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కించి.. అవమానాన్ని మూటగట్టుకున్నాడు. బాలకృష్ణ చెప్పిందల్లా చేసి కథానాయకుడు, మహానాయకుడు అంటూ రెండు సినిమాల్తోనూ క్రిష్ పరువు పోగొట్టుకున్నాడు. కనీసం కాస్త పాజిటివ్ టాక్ వచ్చిన క్రిష్ కి దర్శకుడిగా మంచి పేరొచ్చేది. కానీ అది జరగలేదు. ఒకపక్క బాలీవుడ్ మణికర్ణిక పుండు బాధిస్తుంటే.. మరోవైపు టాలీవుడ్ ఎన్టీఆర్ బయోపిక్ పుండు మీద కారం జల్లినట్టుగా తయారైంది క్రిష్‌కి. కథానాయకుడు తర్వాత మీడియాకి కనబడిన క్రిష్.. మహానాయకుడు దెబ్బకు టాలీవుడ్ లో కనబడకుండా పోయాడు. గత రెండు రోజుల క్రితం మీడియాకి మొహం చూపించని క్రిష్ అంటూ సోషల్ మీడియాలో వార్తలు కూడా వచ్చాయి. 

Advertisement
CJ Advs

మరి ఆ వార్తల ప్రభావమో.. ఏమో కానీ తాజాగా క్రిష్ గురించిన ఒక న్యూస్ బయటికొచ్చింది. క్రిష్ మణికర్ణిక దెబ్బకి బాలీవుడ్ మొహం చూడడు అనుకుంటే.. తాజాగా క్రిష్ బాలీవుడ్ ప్రాజెక్టును సెట్ చేసుకునే పనిలో ఉన్నాడనీ .. త్వరలో ఆ ప్రాజెక్టును పట్టాలెక్కించనున్నాడనే వార్త సోషల్ మీడియాలో హైలెట్ అయ్యింది. మరి టాలీవుడ్, బాలీవుడ్ లలో దెబ్బతిన్న క్రిష్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ని టాలీవుడ్ హీరోతోనే చేస్తాడనుకున్నారు చాలామంది. కానీ టాలీవుడ్ హీరోలెవరు క్రిష్ చెప్పే కథలు వినడానికి సిద్ధంగా లేరని తెలిసి.. మళ్లీ బాలీవుడ్ మీద ఫోకస్ చేస్తున్నాడట క్రిష్. 

అసలే మణికర్ణిక విషయంలో కంగనా చేతిలో మోసపోయిన క్రిష్ మీద బాలీవుడ్ వర్గాల సానుభూతి అయితే ఉంది. మరి ఆ సానుభూతితోనే క్రిష్ కి ఏ హీరోనో అవకాశం ఇచ్చి ఉండాలి. మరి క్రిష్ నిజంగానే బాలీవుడ్ మూవీ కోసం ప్రయత్నాలు చేస్తే మాత్రం.. క్రిష్ ఇక్కడ టాలీవుడ్‌లో మాయమై.. మళ్లీ బాలీవుడ్‌లో తేలాడనే అనాలి.

Director Krish Next Project in Bollywood:

Director Krish film in Bollywood after ntr biopic
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs