Advertisement
Google Ads BL

సమంత, రమ్యకృష్ణ సినిమాకు A ఇచ్చారు


ఎవరో ఒక విలక్షణ నటీనటులు నటిస్తేనే ఆయా చిత్రాలపై అంచనాలు పెరిగిపోతాయి. అయితే సినిమాలోని నటీనటులందరూ విలక్షణమైన వారే అయితే ఆ మూవీపై అంచనాలు భారీగానే ఉంటాయి. అలాంటి పూర్తి విలక్షణ నటీనటులతో నిండిన చిత్రమే ‘సూపర్‌డీలక్స్‌’ చిత్రం. ఇప్పటికే ఈ చిత్రంలోని పోస్టర్స్‌లో సమంతను చూసిన వారికి ఈమె మరోసారి విభిన్నపాత్ర చేస్తోందని అర్ధమవుతోంది. ఇక నీలాంభరి రమ్యకృష్ణ ఓ పోర్న్‌స్టార్‌గా నటిస్తూ ఉండటం మరో ప్లస్‌ పాయింట్‌. కమల్‌హాసన్‌, విక్రమ్‌ల తర్వాత తన ప్రతి పాత్రా వైవిధ్యంగా ఉండేలా చూసుకునే కోలీవుడ్‌ యంగ్‌స్టార్‌ విజయ్‌సేతుపతి ట్రాన్స్‌ జెండర్‌గా నటిస్తూ ఉన్నాడు... ఇలా ఎన్నో ప్రత్యేకతలతో రానున్న చిత్రం ‘సూపర్‌డీలక్స్‌’. 

Advertisement
CJ Advs

విడుదలలో కాస్త జాప్యం జరిగిన ఈ చిత్రం ఈనెల 29వ తేదీన తమిళంతో పాటు తెలుగులో కూడా విడుదల కానుంది. ఇప్పటివరకు విజయ్‌ సేతుపతి ఎన్నో వైవిధ్యభరిత చిత్రాలు చేస్తూ వచ్చిన ఆయన మూవీస్‌ తెలుగు ప్రేక్షకులకు చూసే అవకాశం రాలేదు. కానీ ఆ లోటు ‘సూపర్‌డీలక్స్‌’తో తీరనుంది. మెగాస్టార్‌ చిరంజీవి ‘సై..రా..నరసింహారెడ్డి’తో తెలుగులోకి స్ట్రైట్ ఎంట్రీ ఇస్తున్న విజయ్‌ సేతుపతి చిత్రం ఇలా డబ్‌ కావడం తెలుగు ప్రేక్షకులకు ఆయనను మరింత దగ్గర చేస్తుందనే చెప్పాలి. ఈ మూవీ క్రైమ్‌ థ్రిల్లర్‌గా రూపొందుతోంది. సెన్సార్‌ బోర్డ్‌ నుంచి ఈ మూవీకి ‘ఎ’ సర్టిఫికేట్‌ లభించింది. 

త్యాగరాజన్‌ కుమార్‌రాజా ఈ చిత్రానికి దర్శకుడు. తెలుగులో సమంత, రమ్యకృష్ణలకు మంచి క్రేజ్‌ ఉంది కాబట్టి తెలుగులో కూడా ‘సూపర్‌డీలక్స్‌’కి మంచి ఓపెనింగ్స్‌ వస్తాయనే అంచనాలు ఉన్నాయి. వాళ్లనమ్మకాన్ని ఈ చిత్రం ఎంత వరకు నిలబెడుతుందో వేచిచూడాలి. ‘సూపర్‌డీలక్స్‌’ 29న విడుదల కానుండగా, ఏప్రిల్‌5న సమంత మరోసారి ‘మజిలీ’తో అతి తక్కువ వ్యవధిలో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుండటం విశేషం. 

A Certificate to Samantha and Ramyakrishna Acted movie:

Super Deluxe Movie Censor Completed and Ready to Release
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs