Advertisement

గోపీచంద్ కొత్త చిత్రం మొదలైంది


గోపీచంద్ హీరోగా, భారీ చిత్రాల నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ కాంబినేష‌న్‌లో కొత్త చిత్రం ప్రారంభం

Advertisement

శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ప‌తాకంపై ‘ఛ‌త్ర‌ప‌తి’,  ‘సాహ‌సం’, ‘అత్తారింటికి దారేది’, ‘నాన్న‌కు ప్రేమ‌తో..’ వంటి చిత్రాల‌ను అన్‌కాంప్ర‌మైజ్డ్‌గా నిర్మించి భారీ చిత్రాల నిర్మాత‌గా పేరు తెచ్చుకున్నారు బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్‌.  ముఖ్యంగా ఈయ‌న‌ నిర్మాణంలో టాలీవుడ్ యాక్ష‌న్ హీరో గోపీచంద్ హీరోగా  ట్రెజ‌ర్ హంటింగ్ బ్యాక్‌డ్రాప్‌తో రూపొందిన ‘సాహ‌సం’ మేకింగ్ గురించి ఎంత చెప్పుకున్నా త‌క్కువే. మ‌రోసారి ఈ స‌క్సెస్ ఫుల్ కాంబినేష‌న్‌లో ఎస్‌.వి.సి.సి బ్యాన‌ర్ ప్రొడ‌క్షన్ నెం.26 సినిమా ప్రారంభ‌మైంది. 

సంతోష్ శివ‌న్‌, జ‌యం రాజా వ‌ద్ద అసిస్టెంట్‌గా వ‌ర్క్ చేసిన బిను సుబ్ర‌మ‌ణ్యం ఈ చిత్రంతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. అడ్వెంచ‌ర‌స్ మూవీగా తెర‌కెక్క‌బోతున్న ఈ సినిమాకు స‌తీష్.కె సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ....

నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ మాట్లాడుతూ... ‘‘సాహసం తర్వాత గోపీచంద్‌గారితో సినిమా చేయ‌డం హ్యాపీగా ఉంది.  ద‌ర్శ‌కుడు బిను సుబ్ర‌మ‌ణ్యం చెప్పిన క‌థ చాలా బావుంది. సాహ‌సం ట్రెజ‌ర్ హంటింగ్ పాయింట్ మీద ఎంత అడ్వెంచ‌ర‌స్‌గా ఉంటుందో.. ఈసినిమా దాన్ని మించి ఎగ్జ‌యిటింగ్‌గా ఉంటుంది. అన్ కాంప్ర‌మైజ్‌డ్‌గా సినిమాను నిర్మిస్తాం. జూన్ నుండి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం అవుతుంది. హీరోయిన్‌, ఇత‌ర న‌టీన‌టులు, టెక్నీషియ‌న్స్ వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తాం’’ అన్నారు.

Gopichand New Movie Launched:

Gopichand New Movie in Sri venkateswara Cine Chitra Banner
Show comments


LATEST TELUGU NEWS


Advertisement

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

Advertisement