Advertisement
Google Ads BL

వేర్ ఈజ్ వెంకీ..? ఇక అంతేనా?


తొలిప్రేమ సినిమాతో ఒక్కసారిగా ఇండస్ట్రీలోకి దూసుకొచ్చిన వెంకీ అట్లూరి.. ఆ సినిమాతో బాగా పాపులర్ అయ్యాడు. వరుణ్ తేజ్ - రాశి ఖన్నా జంటగా తెరకెక్కిన తొలిప్రేమ సినిమా ప్రేమకథగా వెంకీ అట్లూరి మలిచిన తీరుకు అందరూ ఫిదా అయ్యారు. వరుణ్ తేజ్ కి రాశి ఖన్నాకి తొలిప్రేమ మంచి హిట్ ఇచ్చింది. ఇక వెంకీ అట్లూరికి కూడా మంచి మంచి ఆఫర్స్ రావడం.. వెంకీ మాత్రం అఖిల్ కి కనెక్ట్ అవడం జరిగింది. రెండు సినిమాల ప్లాప్స్ తో ఉన్న అఖిల్ తో వెంకీ అట్లూరి  మిస్టర్ మజ్ను అంటూ ఒక లవ్ స్టోరీనే తెరకెక్కించాడు.

Advertisement
CJ Advs

కానీ ఆ సినిమా కూడా ప్లాప్ లిస్ట్ లో చేరింది. అప్పటికే రెండు డిజాస్టర్స్ తో ఉన్న అఖిల్ మళ్ళీ మిస్టర్ మజ్నుతో డిజాస్టర్ అందుకున్నాడు. పాపం అఖిల్ దురదృష్టం వెంకీ అట్లూరికి కూడా అంటుకుంది. ఆ సినిమా తర్వాత అఖిల్ కానీ వెంకీ అట్లూరి కానీ చప్పుడు చేయడం లేదు. అయితే అఖిల్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయంలో వార్తలు మీడియాలో వినబడుతున్నాయి కానీ... వెంకీ అట్లూరి ఊసు మాత్రం ఎక్కడా వినబడడం లేదు. 

అఖిల్ 4 ని బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో చేస్తున్నాడు. ఆ సినిమా గీత ఆర్ట్స్ బ్యానర్ లో ఉంటుందనే టాక్ వినబడుతుంది. మరి అఖిల్ న్యూస్ ఏదో విధంగా హైలెట్ అవుతుంది కానీ.. వెంకీ అట్లూరి నెక్స్ట్ ప్రాజెక్ట్ విషయమై ఎక్కడా వినిపించడం లేదు. మిస్టర్ మజ్ను తర్వాత వెంకీ ప్రాజెక్ట్ పై క్లారిటీ రావడం లేదు. మరి అందుకే అందరూ వేర్ ఈజ్ వెంకీ అంటున్నారు.

Where is Venky?:

Venky Atluri goes silent after Mr Majnu
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs