Advertisement
Google Ads BL

పృథ్వీ,చిన్ని,పోసాని.. వీరి మాటలకు విలువుందా?


మొత్తానికి జనసేనాధిపతి పవన్‌ని టార్గెట్‌ చేయడానికి జగన్‌ సినీ పరిశ్రమకు చెందిన వారినే ఎంచుకుంటున్నాడు. కానీ అలా టార్గెట్‌ చేస్తున్న వారి పేర్లు కూడా జనాలకు తెలియకపోవడమే విచిత్రం. అదే స్థాయి వ్యక్తులతో టార్గెట్‌ చేయిస్తే కాస్తైనా ఫలితం ఉంటుంది గానీ 30 ఇయర్స్‌పృథ్వీ, రోజా, చిన్నికృష్ణ, పోసాని.. వంటి వారి మాటలకు ఏ విలువ ఉంటుంది? అనేది ప్రశ్నార్దకమే. చంద్రబాబుని సపోర్ట్‌ చేసిన హీరో శివాజీకి జగన్‌ గురించి విమర్శించే స్థాయి లేదు అని అన్నవారు.. ఇప్పుడు పవన్‌నిె టార్గెట్‌ చేస్తున్న వారికి ఆ స్థాయి ఉందా? అనేదే అసలు ప్రశ్న. 

Advertisement
CJ Advs

తాజాగా రచయిత చిన్నికృష్ణ పవన్‌ గురించి మాట్లాడుతూ, నేను నోరు తెరిస్తే పవన్‌ నవరంధ్రాలు మూసుకోవాల్సిందే. మీరు, మీ కుటుంబం ఏ పార్టీతో కలిశారో.. ఆ పార్టీ సభ్యులందరికీ పేరు పేరునా చెబుతున్నాను. నా నోరు తెరిపించే ప్రయత్నం చేయద్దని కోరుతున్నాను. స్వార్థ పూరిత రాజకీయాల కోసం హైదరాబాద్‌లో ఉన్న ఆంధ్రోళ్ల ప్రాణాలతో చెలగాటం ఆడతున్నారు. ఎన్నికల్లో పోటీ చేస్తూ మీ సిద్దాంతం ఏమిటో మీరు చెప్పండి.. జగన్‌లాగే మీరు పార్టీ పెట్టుకున్నారు. ప్రజలకు మీరేం చేస్తారో చెప్పండి. కానీ జగన్‌పై నిందలేస్తారా? కోడికత్తిపై విషం చిమ్ముతారు. అతనికి అతనే పొడిపించుకున్నాడంటారు. బాబాయ్‌ హత్య జరిగే జగనే చేయించాడని అంటారు. రేపు జగన్‌ తనకి తానే విషం తాగి చనిపోయాడంటారు. 

ఆంధ్రా ఓటర్లు ఏ పార్టీ పక్షాన ఉన్నారో మేలో తెలుస్తుంది. ఫలితాల రోజున టివిల ముందు కూర్చున మీ గుండెలు పగిలే నిజం తెలుస్తుంది. జగన్‌ అంత మెజార్టీతో గెలవబోతున్నారు. మీరే చూస్తారు ఇదంతా అని వ్యాఖ్యానించాడు. గతంలో స్థాయిలేని వేణుమాధవ్‌ జగన్‌ని బట్టేబాజ్‌ అన్నప్పుడు ఎంతగా వ్యతిరేకించారో నేడు చిన్నికృష్ణ వ్యాఖ్య్యలను, అందునా నవరంధ్రాలు మూసుకుంటారు అనే అసభ్యపదజాలంపై ప్రజల్లో నిరసన వ్యక్తం అవుతోంది. 

YSRCP Prepares More Chinnikrishnas on Pawan:

YSRCP Targets Pawan Kalyan in Personally
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs