Advertisement
Google Ads BL

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ వెనుకెవరున్నారో తెలిసిపోయింది


టాలీవుడ్ నటులలో చాలామంది ఏపిలోని వైసిపి పార్టీకి మద్దతునిస్తూ జగన్ కి సపోర్ట్ చేస్తున్నారు. నిన్నమొన్నటివరకు టిడిపి అన్న మోహన్ బాబు ఇప్పుడు వైసిపికి అనుకూలంగా మారడమే కాదు.. తాజాగా అయన వైసిపి కండువా కప్పేసుకున్నారు. కొడుకు విష్ణుతో కలిసి మరీ వైసిపికి జంప్ అయ్యారు. ఇలా పార్టీలోకి రావడానికి ముందు మోహన్ బాబు ఫీజు రీయింబర్స్‌ మెంట్ అంటూ విద్యార్థులతో కలిసి ధర్నా చేస్తూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుని, టిడిపి ప్రభుత్వాన్ని నానా మాటలు అన్నారు. ఇదంతా మోహన్ బాబు వైసిపిలోకి చేరడానికి అన్న విషయం ఈ రోజు తేటతెల్లమైంది.

Advertisement
CJ Advs

అయితే మోహన్ బాబుకి మిత్రుడు రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం టిడిపిని, బాబుని ఏడిపించే ప్రయత్నాల్లో ఉన్నాడు. లక్ష్మీస్ ఎన్టీఆర్ అంటూ ఉడికిస్తున్నాడు. తాజాగా సెన్సార్ వారు కూడా లక్ష్మీస్ ఎన్టీఆర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు. మరోపక్క ఈసీ కూడా లక్ష్మీస్ ఎన్టీఆర్ ని ఎలాంటి అడ్డంకులు లేకుండా విడుదల చెయ్యొచ్చని చెప్పాక కూడా వర్మ.. చంద్రబాబుని వదిలే పరిస్థితి కనబడడం లేదు. తాజాగా వర్మ - మోహన్ బాబులు కలిసి దిగిన ఫోటోని వర్మ సోషల్ మీడియాలో షేర్ చేసాడు. ఇక ఆ ఫోటోతో పాటుగా చంద్రబాబు ఇలాంటి వాడు అనుకోలేదు అంటూ చేసిన పోస్ట్ ఇప్పుడు ప్రకంపనలు సృష్టిస్తుంది.

మరి వర్మ ఇలా రెచ్చిపోవడానికి వెనుక ఎవరున్నారో అంటూ చాన్నాళ్లుగా చాలామంది ఆలోచిస్తున్నారు. అయితే చివరికి మోహన్ బాబే, వర్మ వెనుకుండి ఈ తతంగాన్ని అంతా నడిపిస్తున్నాడా? చంద్రబాబుని విలన్ గా చూపెట్టడానికి మెయిన్ కారణం మోహన్ బాబేనా? మోహన్ బాబు, ఎన్టీఆర్ - లక్ష్మీ పార్వతి పెళ్లిచేసుకున్న టైములో ఎన్టీఆర్ కి అతి సన్నిహితంగా వున్న వ్యక్తి. ఎన్టీఆర్ వెన్నుపోటు రాజకీయాలప్పుడు మాత్రం నందమూరి ఫ్యామిలీకి దగ్గరయ్యాడు. మరి లక్ష్మీస్ ఎన్టీఆర్ కి కథా సహకారం మోహన్ బాబు వర్మకి అందించాడు? అందుకే ఇప్పుడు వర్మ - మోహన్ బాబులు కలిసి బాబుని ఇరికించే ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఫిలింనగర్ లో వినిపిస్తున్న ముచ్చట్లు.

He is the Main for Lakshmis NTR making:

Lakshmis NTR Ready to Release
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs