Advertisement
Google Ads BL

ఆ సినిమాలో ఇద్దరు ప్రభాస్‌లు..!


ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సాహో సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఆగష్టు 15 న సాహో సినిమా విడుదలకు డేట్ లాక్ చేసింది సాహో టీం. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సాహో సినిమా నేషనల్ వైడ్ గా తెరకెక్కుతుంది. ఇక బాహుబలి తర్వాతి సినిమా కావడంతో.. ఈ సాహో సినిమా మీద భారీ అంచనాలున్నాయి. సాహో సినిమా షూటింగ్ చివరి దశకు చేరడంతో... ప్రభాస్.. రాధాకృష్ణ సినిమాకు షిఫ్ట్ అయ్యాడు. జిల్ ఫేమ్ రాధాకృష్ణ డైరెక్షన్ లో ప్రభాస్ ఒక రొమాంటిక్ లవ్ స్టోరీలో నటిస్తున్న విషయం తెలిసిందే. పూజహెగ్డేతో రొమాన్స్ చేస్తున్న ప్రభాస్ ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ని ఎప్పుడో కంప్లీట్ చేసాడు.

Advertisement
CJ Advs

1960 కాలం నాటి ప్రేమకథ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోందని ప్రచారం జరుగుతున్న వేళ ప్రభాస్ ఈ సినిమాలో ద్విపాత్రాభినయం చేయనున్నాడనేది తాజా సమాచారం. కథానుసారంగా ప్రభాస్ ఒక పాత్రలో ప్లే బాయ్ గా అల్లరి చిల్లరిగా కనబడతాడని.. అలాగే మరో పాత్రలో సిన్సియర్ ప్రేమికుడిగా కనిపిస్తాడనేది లేటెస్ట్ న్యూస్. మరి డ్యూయెల్ రోల్ లో ప్రభాస్ ఎలా ఇరగదీస్తాడో అనే క్యూరియాసిటిలో ప్రభాస్ ఫ్యాన్స్ ఉన్నారు. తాజాగా రాధాకృష్ణ సెకండ్ షెడ్యూల్ కూడా మొదలెట్టేసాడు. మరి రాధాకృష్ణ మూవీ కూడా భారీ బడ్జెట్ తో భారీగా నేషనల్ వైడ్ గా తెరకెక్కుతుంది. మరి సాహో, రాధాకృష్ణ మూవీస్ తో ప్రభాస్ క్రేజ్ మరింతగా పెరగడం ఖాయమే. 

Prabhas Double Role in his Next Film:

Prabhas Dual Role in Radhakrishna Film
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs