Advertisement
Google Ads BL

సెన్సార్ సర్టిఫికెట్‌తో క్రేజ్ మొత్తం పోయింది!


ఇప్పటివరకు రామ్ గోపాల్ వర్మ అనుకున్నట్లుగానే ఆయన సినిమా లక్ష్మీస్ ఎన్టీఆర్ కి ట్రేడ్ లోను తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల్లోనూ భీభత్సమైన క్రేజ్ వచ్చేసింది. ఎన్టీఆర్ జీవితంలోని చివరి అంకాన్ని లక్ష్మీస్ ఎన్టీఆర్ గా తెరకెక్కించిన వర్మ.. ఆ సినిమాతో టిడిపి, చంద్రబాబు, నందమూరి ఫ్యామిలీస్ ని ఒక ఆటాడుకోవాలనుకున్నాడు. అందుకే లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రోమోస్ ని, ట్రైలర్ ని కూడా వివాదాలు చెలరేగేలా కట్ చేసి వదిలాడు. మరి వర్మ అనుకున్నట్లుగానే లక్ష్మీస్ ఎన్టీఆర్ ట్రైలర్ కానివ్వండి, ప్రోమోస్ కానివ్వండి అన్ని ప్రేక్షకుల్లో విపరీతమైన క్యూరియాసిటీని పెంచేసాయి. మరి చంద్రబాబుని, నందమూరి ఫ్యామిలీని, టిడిపి నేతలను విలన్స్ గా చూపించిన వర్మకు.. ఈ లక్ష్మీస్ ఎన్టీఆర్ ని విడుదల చెయ్యడం అనేది ఛాలెంజ్ అన్నారు.

Advertisement
CJ Advs

కానీ టిడిపి, నందమూరి ఫ్యామిలీ, నారా చంద్రబాబు, బాలయ్య ఎవరూ లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలను అడ్డుకోకుండా వదిలేసారు. ఇక ఎన్నికల టైంలో భారీ హైప్ మూటగట్టుకున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాకి కనీసం సెన్సార్ అయినా బ్రేకులేస్తుందేమో అనుకున్నారు. కానీ సెన్సార్ సభ్యులు మొదట్లో లక్ష్మీస్ ఎన్టీఆర్ కి సెన్సార్ చెయ్యమని చెప్పిన.. చివరికి సెన్సార్ బోర్డు ఆదేశాలతో లక్ష్మీస్ ఎన్టీఆర్ కి సెన్సార్ చేసింది. లక్ష్మీస్ ఎన్టీఆర్ కి క్లిన్ యు సర్టిఫికెట్ ఇచ్చేసింది. మరి సినిమాలో వివాదాస్పద అంశాలేమన్నా ఉంటే గనక సెన్సార్ సర్టిఫికెట్ లో తేడాలొచ్చేవి. కానీ ట్రైలర్ లో వివాదాన్ని చూపించిన వర్మ సినిమాలో చూపించలేకపోవడంతోనే సినిమాకి క్లిన్ యు వచ్చిందంటున్నారు.

మరి ఇప్పటివరకు మంచి అంచనాలు, భారీ క్రేజ్ తో ఉన్న లక్ష్మీస్ ఎన్టీఆర్ కి భారీ టాక్ ఎలా వున్నా భారీ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకోవడం ఖాయమన్నారు. కానీ ఇప్పుడు సెన్సార్ సర్టిఫికెట్ చూస్తే.. సినిమాలో ఏం లేదేమో అందుకే సెన్సార్ వారు క్లిన్ యు ఇచ్చారు. అని ప్రేక్షకుడు అనుకుంటే.. లక్ష్మీస్ ఎన్టీఆర్ కి దెబ్బే.  ఇప్పటివరకు భారీ హైప్ ని మూటగట్టుకున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ ఇప్పుడు సెన్సార్ సర్టిఫికెట్ తో క్రేజ్ ని కోల్పోతుందేమో అనిపిస్తుంది. మరి భారీ హైప్ మధ్య ఈ ఎలక్షన్స్ మూమెంట్‌లో సినిమాని విడుదల చేసి క్యాష్ చేసుకోవాలనుకున్న వర్మకి ఈ సెన్సార్ సర్టిఫికెట్... షాకిచ్చిందనే చెప్పాలి. ఈ 29న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ లక్ష్మీస్ ఎన్టీఆర్ క్రేజ్ ఎంతుందో అనేది ఆ సినిమా విడుదలైన మొదటి షో వరకు చెప్పడం కష్టమే.

No Craze on Lakshmis NTR after Censor Certificate:

Lakshmis NTR Movie Censor Completed
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs