Advertisement
Google Ads BL

దీపిక స్థానాన్ని ఈ భామ ఆక్రమించేసినట్లే!


బాలీవుడ్ లో రెండు మూడేళ్లుగా దీపికా పదుకొనే టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది. ప్రియాంక చోప్రా హాలీవుడ్ కి చెక్కేశాక.. దీపికా దే హవా.. అటు స్టార్ హీరోలతోనూ, ఇటు లేడి ఓరియెంటెడ్ మూవీస్ తోనూ దీపికా సూపర్ ఫామ్ లోకొచ్చేసింది. భాజీ రావు మస్తానీ, పద్మావతీ లాంటి చారిత్రాత్మక చిత్రాలతో దీపికా పదుకునే తన స్థానాన్ని బాలీవుడ్ పదిలం చేసుకుంది. అయితే గత ఏడాది రణవీర్ సింగ్ ని పెళ్లాడిన దీపికా పదుకొనే కి టాప్ పొజిషన్ కి ఏ మాత్రం ఢోకా లేదు కానీ.. ఇప్పుడు దీపికా స్థానాన్ని మరో హీరోయిన్ ఆక్రమించేలా కనబడుతుంది. అలాగే ఇప్పటికే దీపికా పదుకొనే మాజీ బాయ్ ఫ్రెండ్ ని తన వెంట తిప్పుకుంటుంది కూడా.

Advertisement
CJ Advs

ఆమె ఎవరో కాదు గత రెండేళ్లుగా మెల్లగా బాలీవుడ్ లో హీరోయిన్ గా ఎదిగిన అలియా భట్. అలియా భట్ ప్రస్తుతం బాలీవుడ్ లో సూపర్ ఫామ్ లో ఉన్న హీరోయిన్. స్టార్ హీరోల సినిమాలో నటిస్తూ స్టార్ హీరోయిన్ గా వెలిగిపోతుంది. గత ఏడాది సూపర్ హిట్స్ తో ఉన్న అలియా ఈ ఏడాది భారీ బడ్జెట్ మూవీస్ లో నటిస్తుంది. ఇప్పటికే బ్రహ్మాస్త్ర, కళంక, సడక్ వంటి చిత్రాలతో పాటుగా.. టాలీవుడ్ లో ప్రెస్టీజియస్ మూవీ RRR లో రామ్ చరణ్ కి జోడిగా నటిస్తుంది. దాదాపుగా 1000 కోట్ల బడ్జెట్ మూవీస్ లో నటిస్తున్న అలియా భట్ ఇప్పుడు దీపికా స్థానాన్ని కొట్టేసిందనిపిస్తుంది. 

మరోవైపు దీపికా పదుకొనే బాయ్ ఫ్రెండ్ రణబీర్ కపూర్ ని కొంగున కట్టేసుకుంది. ఒకప్పుడు దీపికా పదుకొనే ని పెళ్లాడతాడనుకున్న రణబీర్ కపూర్.. ఆమెతో బ్రేకప్ చేసుకున్నాక మరో హీరోయిన్ తో చెట్టాపట్టాలేసుకుని తిరిగి చివరికి అలియా భట్ దగ్గర ఆగాడు. ప్రస్తుతం అలియా - రణబీర్ కపూర్ ల జంట ఎక్కడపడితే అక్కడ పబ్లిక్ గా తిరుగుతుంది. ఇక దీపికా పదుకొనేతో కూడా అలియా భట్ మంచి సంబంధాలే మెయింటింగ్ చేస్తుంది. జీ సినీ అవార్డ్స్ లోను, ఫిలిం ఫేర్ అవార్డ్స్ లోను దీపికా, అలియాల కౌగిలింతలు, ముద్దులు అన్ని మీడియాలో హైలెట్ అయ్యాయి.

Young heroine replaces deepika in Bollywood:

Alia bhatt Replaces Deepika Padukone
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs