Advertisement
Google Ads BL

‘ఎన్టీఆర్’ దెబ్బకి అజ్ఞాతవాసం!


గత ఏడాది బాలీవుడ్ మణికర్ణిక సినిమాని తెరకెక్కిస్తూ నేషనల్ వైడ్ న్యూస్ లో నిలిచిన దర్శకుడు క్రిష్. టాలీవుడ్‌లోను ఒక మహోన్నత వ్యక్తి జీవిత చరిత్రని తెరకెక్కించి.... ప్రస్తుతం ఎవరి కంట పడకుండా.. మాయమైయ్యాడు. ఎన్టీఆర్ బయోపిక్ ని కథానాయకుడు, మహానాయకుడు అంటూ తెరకెక్కించిన క్రిష్ కి రెండు సినిమాలు డిజాస్టర్స్ కావడంతో... చడీ చప్పుడు లేకుండా కామ్ అయ్యాడు. కథానాయకుడు బాగుంది అన్నప్పటికీ.. ఆ సినిమాకి కలెక్షన్స్ నిల్. ఇక మహానాయకుడుని ప్రేక్షకులు పట్టించుకున్న పాపాన పోలేదు. మరి బాలకృష్ణ చెప్పినట్టుగా ఎన్టీఆర్ బయోపిక్ తీసి క్రిష్ బాగా బుక్కయ్యాడు. 

Advertisement
CJ Advs

మరోపక్క మణికర్ణిక వలన కూడా క్రిష్ చాలా ఇబ్బందులే పడ్డాడు. కంగనా వలన క్రిష్ చాలా లాస్ అయ్యాడు కూడా. పారితోషకం పరంగా. దర్శకత్వపరంగా అన్ని విషయాల్లోనూ క్రిష్ అవమాన పడ్డాడు. కథానాయకుడు హిట్ అన్నాక మణికర్ణిక విషయంలో క్రిష్ నోరు తెరిచినా... మహానాయకుడు దెబ్బకి బెంబేలెత్తిన క్రిష్.. ఆ సినిమా విడుదలయ్యాక మళ్ళీ మీడియాకి ముఖం చూపించలేదు. మరి మీడియా ఎలాంటి ప్రశ్నలు సందిస్తుందో.. క్రిష్ కి తెలుసు, అందుకే క్రిష్ మొహం చాటేశాడు. 

అయినా ఎన్టీఆర్ బయోపిక్ విషయంలో క్రిష్ తప్పేమి లేదు. క్రిష్ డైరెక్షన్‌కి పెద్దగా పేరు పెట్టడానికి లేకపోయినా.. ఎన్టీఆర్ భజన, చంద్రబాబు భజనని ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయారు. అందుకే ఆ రెండు సినిమాలను శంకరగిరి మాన్యాలు పట్టించారు. ప్రస్తుతం క్రిష్ మాత్రం ఎక్కడా ఎవరికీ కనబడకుండా సైలెంట్ అయ్యాడు.

Where is NTR Biopic Director?:

No Movie to Director Krish Hands
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs