Advertisement
Google Ads BL

5గురు హీరోలకు నచ్చనిది నితిన్‌కి నచ్చింది


బోలెడన్ని డిజాస్టర్స్ తో మళ్ళీ ప్లాప్ ట్రాక్ ఎక్కిన నితిన్ ఇప్పుడు వరసగా కొత్త సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ఇప్పటికే వెంకీ కుడుముల దర్శకత్వంలో భీష్మ చిత్రం చేస్తున్ననితిన్... హోలీ రోజున ప్లాప్ దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో ఒక మూవీ అనౌన్స్ చేసాడు. ఇక ప్లాప్ డైరెక్ట తో నితిన్ సాహసం అంటూ.. మీడియాలో న్యూస్ లు కుప్పలు తెప్పలుగా ప్రచారంలోకి వచ్చాయి. ఇక రమేష్ వర్మతో నితిన్ సినిమా అంటూ ప్రచారం జరిగినా.. నితిన్ ఆ న్యూస్ ఫేక్ న్యూస్ అంటూ స్పందించడంతో... ఆ సినిమా లేదని తేలిపోయింది. ఇక నితిన్ చంద్రశేఖర్ చెప్పిన కథకు కనెక్ట్ అయ్యి ఆయనతో సినిమా అనౌన్స్ చేసాడు.

Advertisement
CJ Advs

అయితే చంద్రశేఖర్ యేలేటి, నితిన్ కి చెప్పిన కథే మరో ఐదుగురు హీరోలకు చెప్పగా.. ఆ హీరోలంతా చంద్రశేఖర్ యేలేటి కథని రిజెక్ట్ చెయ్యగా.. చివరికి ఆ కథ నితిన్ వద్దకు చేరగా.. నితిన్ ఓకే చేసాడంటున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో చంద్రశేఖర్ ఈ కథను తయారుచేసి హీరోలకు వినిపించాడట. అయితే చంద్రశేఖర్ యేలేటి కథ చెప్పిన హీరోలెవరో తెలుసా... ఎన్టీఆర్ నుండి నాని, సాయిధ‌ర‌మ్ తేజ్‌, వ‌రుణ్‌తేజ్‌, గోపీచంద్‌లు ఈ కథను రిజెక్ట్ చేసిన వారిలో ఉన్నట్లుగా తెలుస్తుంది. మరి పెద్ద హీరోలే చెయ్యనని చెప్పిన ఆ కథ నితిన్ కి ఎలా నచ్చిందో. అసలే ప్లాప్స్ లో ఉన్న నితిన్... మళ్ళీ ఇలా ప్లాప్ డైరెక్టర్ కి కనెక్ట్ అవడాన్ని జీర్ణించుకోలేకపోతున్న నితిన్ ఫ్యాన్స్.. ఇప్పుడు ఐదుగురు హీరోలు రిజెక్ట్ చేసిన కథ నితిన్ కి నచ్చడం ఏమిటంటూ తలలు పట్టుకుంటున్నారట.

ఇకపోతే ఏడాది కాలంగా మైత్రి మూవీస్ నిర్మాణంలో సినిమా చేస్తానని చెప్పిన.. చంద్రశేఖర్ యేలేటి ఇప్పుడు మైత్రి ఇచ్చిన అడ్వాన్సు వెనక్కి ఇచ్చేసి మరీ... భవ్య క్రియేషన్స్ లో నితిన్ మూవీని పట్టాలెక్కించబోతున్నాడట.  ఏప్రిల్ నుండి సెట్స్ మీదకెళ్లాల్సిన ఈ మూవీ సక్రమంగా పట్టాలెక్కుతోంది అంటే.. నమ్మకం లేదంటున్నారు. ఎందుకంటే చంద్రశేఖర్ యేలేటి ఇంకా సెకండ్ హాఫ్ కథను పూర్తిగా ప్రిపేర్ చెయ్యలేదని.. ఆ సెకండ్ హాఫ్ నచ్చకే ఆ టాప్ హీరోలంతా ఆ కథను రిజెక్ట్ చేసినట్లుగా సమాచారం. మరి నితిన్ కి ఏం చెప్పి ఒప్పించాడో ఈ డైరెక్టర్.

Nithin Announces Yeleti film:

Nithin Movie with Chandrasekhar Yeleti 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs