వరుణ్ తేజ్ సమర్పణలో నిర్వాణ సినిమాస్ బ్యానర్‌పై నిహారిక కొణిదెల, రాహుల్ విజయ్ జంటగా నటించిన చిత్రం ‘సూర్యకాంతం’. ప్రణీత్ బ్రహ్మాండపల్లి దర్శకత్వంలో సందీప్ ఎర్రంరెడ్డి, సుజన్ ఎరబోలు, రామ్ నరేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ శనివారం హైదరాబాద్ జెఆర్‌సిలో జరిగింది. ఈ సందర్భంగా తొలి టిక్కెట్‌ను విజయ్ దేవరకొండకు నీహారిక గిఫ్ట్ ఇచ్చారు. అనంతరం సూర్యకాంతం ఆడియో సీడీలను విజయ్ దేవరకొండ ఆవిష్కరించారు.
నిహారిక కొణిదెల మాట్లాడుతూ.. ‘‘ఈరోజు ఈ సినిమా ఇక్కడి వరకు వచ్చిందంటే అందుకు కారణం మా అన్న వరుణ్‌తేజ్. ఎక్కడో అమెరికాలోని ప్రొడ్యూసర్స్‌ని, ఇక్కడ ఉన్న హీరో, డైరెక్టర్ అందరినీ కలిపి ఓ ఫజిల్ పీస్‌లా సెట్ చేసి సినిమా చేయమని సలహా ఇచ్చాడు. మా నిర్మాతలు సందీప్, రామ్‌నరేష్, సుజన్ గారికి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రాజ్‌గారికి థ్యాంక్స్. మా స్క్రిప్ట్ నచ్చి, నేను చేయగలను అని నమ్మకంతో సినిమా చేసిన నిర్మాతలకు పెద్ద థ్యాంక్స్. మా డైరెక్టర్ ప్రణీత్.. తన పేరు ఇండస్ట్రీలో చాలా బాగా వినపడుతుంది. అందరం ఫ్యామిలీలా కష్టపడి సినిమా చేశాం. రాహుల్ తో పనిచేయడాన్ని రెస్పెక్ట్‌గా భావిస్తున్నాను. తను మంచి నటుడే కాదు.. మంచి వ్యక్తి. అందరికీ గౌరవం ఇస్తుంటాడు. తన నుండి ఆ విషయాన్ని నేర్చుకున్నాను. ఈ సినిమాలో తను అభిలాంటి వ్యక్తే. అభిగా ఎవరిని తీసుకోవాలని చాలా వెతికాం. కానీ తను మణికొండలోనే దొరికాడు. తనలాగానే మరొకరు న్యాయం చేయలేరేమో అనిపించింది. ఈ సినిమాలో ప్రతి పాత్రకు తగ్గ ఆర్టిస్టులు దొరికారు. పెర్లిన్ కూడా చాలా మంచి పాత్ర చేసింది. మార్క్ కె.రాబిన్ సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాను మరో లెవల్‌కి తీసుకెళ్తాయనడంలో సందేహం లేదు. హరిగారు ప్రతి విజువల్‌ను అందంగా చూపించారు. ఆయన ఫ్యూచర్‌లో పెద్ద సినిమాటోగ్రాఫర్‌గా ఎదుగుతారు. సుహాసినిగారు, శివాజీరాజాగారు.. ఇలా చాలా మంది సీనియర్స్‌తో కలిసి నటించాను. నా పాత్రకు 100 శాతం న్యాయం చేశానని అనుకుంటున్నాను. అందరికీ నచ్చుతుందని భావిస్తున్నాను’’ అన్నారు.
హీరో రాహుల్ విజయ్ మాట్లాడుతూ.. ‘‘మా సినిమాకు పనిచేసిన కెమెరామెన్ హరిగారు, సంగీతం అందించిన మార్క్ కె.రాబిన్‌గారు, యష్ మాస్టర్, విజయ్ మాస్టర్‌గారు సహా అందరికీ థ్యాంక్స్. వరుణ్ అన్న వల్లనే నేను ఈ స్టేజ్‌పై నిలబడి ఉన్నాను. ప్రణీత్‌ను పిలిపించి అభి క్యారెక్టర్‌కి నేను సూట్ అవుతానని ఆయనే సజెస్ట్ చేశారు. ఫిలిం మేకింగ్ లో వచ్చే సమస్యలను నిర్మాతలు ఏ రోజూ మా వరకు తీసుకు రాలేదు. పూజా చాలా బాగా నటించింది. నాకు వాళ్లిద్దరి మీద చాలా గౌరవం ఉంటుంది. వాళ్లు ఎక్కడుంటే అక్కడ అట్మాస్పియర్ చాలా హ్యాపీగా ఉంటుంది.. ఈ డైరక్టర్‌కి క్లారిటీ ఉంది. నీహారికగారు సూర్యకాంతం అనే టైటిల్‌కి యాప్ట్. ‘నీహారిక నా బెస్ట్ ఫ్రెండ్, తను చాలా మంచి ఆర్టిస్ట్, తనకి ఈ సినిమా పెద్ద హిట్ కావాలని’ డైరెక్టర్ నాతో చెప్పాడు. ఈ సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నా. ఈ నెల 29న మా సినిమాను చూడండి’’ అని అన్నారు.
రచయిత కృష్ణకాంత్ మాట్లాడుతూ.. ‘‘గుండమ్మ కథ లాంటి సినిమాను రీమేక్ చేయాలంటే సూర్యకాంతం రోల్ చేసేవారు లేరు. తెరమీద నాకు ఆ పాత్ర పాజిటివ్‌గానే కనిపిస్తోంది’’ అని అన్నారు.
ఫైట్ మాస్టర్ విజయ్ మాట్లాడుతూ.. ‘‘సూర్యకాంతం ప్రీ రిలీజ్ ఫంక్షన్ వచ్చినందుకు ఆనందంగా ఉంది. నేను ఫస్ట్ వరుణ్‌తేజ్‌కి థ్యాంక్స్ చెప్పాలి. ఇందులో రాహుల్ నటించడానికి ముఖ్య కారణం మా వరుణ్‌బాబు. నేను నాగబాబు అన్నయ్యని కలిసి ‘వరుణ్‌ని కలవాలి’ అని అన్నా. ‘నన్ను అడుగుతావెందుకు నువ్వు వెళ్లి కలువు’ అని అన్నారు. నేను వెళ్లగానే అతను ‘ఏం చేస్తున్నారు’ అని అడిగారు. వెంటనే ఈ అవకాశం గురించి చెప్పాడు. వరుణ్‌బాబుకి థ్యాంక్స్. ఈ నిర్మాతలకి థ్యాంక్స్. ప్రణీత్ చూడ్డానికి అలా ఉంటాడు కానీ, ఇండస్ట్రీలో పెద్ద హిట్ కొడతాడు. నీహారిక నా దృష్టిలో బంగారం. తనకి మంచి హిట్ రావాలి. మా నిర్మాతలకు ఈ సినిమా పెద్ద హిట్ కావాలి’’ అని అన్నారు.
దివ్య మాట్లాడుతూ.. ‘‘వరుణ్‌కి థ్యాంక్స్. ఈ ప్రాజెక్ట్ రాహుల్ చేయడానికి మేజర్ రీజన్ వరుణ్. ప్రణీత్‌కి, సృజన్‌కి, సందీప్‌కి ఆల్ ది బెస్ట్’’ అని అన్నారు.
కాలభైరవ మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమాకు నేనేం చేయలేదు. కానీ ప్రణీత్ నా బెస్ట్ ఫ్రెండ్. తను నాకు చాలా థిక్కెస్ట్ ఫ్రెండ్. తను నాకు స్టోరీ చెప్పాడు. నిన్నా మొన్నా అతను నాకు కథ చెప్పినట్టే ఉంది. అతనికి ఈసినిమా పెద్ద హిట్ కావాలి. రాహుల్ చాలా టాలెంటెడ్ ఆర్టిస్ట్’’ అని అన్నారు.
పెర్లిన్ మాట్లాడుతూ.. ‘‘సూర్యకాంతం అనేది రామ్‌కామ్. ఫన్ లవింగ్ అంశాలు ఇందులో చాలా ఉంటాయి. థరో ఎంటర్‌టైనర్ ఇది’’ అని చెప్పారు.
మార్క్ మాట్లాడుతూ.. ‘‘సినిమాకు పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. సూర్యకాంతానికి పనిచేయడం చాలా గొప్ప అవకాశం. ప్రతి అమ్మాయిలోనూ ఒక అర్జున్‌రెడ్డి పాత్ర ఉంటుంది. దాన్ని ఈ సినిమాలో చూస్తారు. మిమ్మల్ని మీరు ఈ సినిమాలో చూసుకుంటారు’’ అని అన్నారు.
కల్వకుంట్ల తేజేస్వర్ మాట్లాడుతూ.. ‘‘మాకు కొణిదెల ఫ్యామిలీతో మంచి అనుబంధం ఉంది. ఈ టైటిల్ నా దగ్గరే రిజిస్టర్ అయి ఉంది. నాగబాబుగారు నాకు ఫోన్ చేసి టైటిల్ అడిగారు. ఈ టైటిల్‌ని నేను రామసత్యనారాయణ దగ్గర నుంచి టేకప్ చేశా. రమ్యకృష్ణగారిని ఉద్దేశంలో పెట్టుకుని కథను సిద్ధం చేయాలని అనుకున్నాం. కానీ నీహారికకు సరిపోతుందనిపించి టైటిల్‌ను శాక్రిఫైస్ చేశాను’’ అని అన్నారు.