హీరో శ్రీకాంత్ ప్రారంభించిన ‘బ్యాచిలర్ పార్టీ’
సుధాకర్ ఇంపెక్స్ ప్రైవేటు లిమిటెడ్ పతాకంపై భూపాల్, అరుణ్ హీరోలుగా డి. రామకృష్ణ దర్శకత్వంలో బ్యాచిలర్ పార్టీ తెరకెక్కనుంది. కాగా ఈ చిత్ర ప్రారంభోత్సవానికి హీరో శ్రీకాంత్ క్లాప్ నిచ్చారు. అనంతరం స్క్రిప్టును చిత్ర నిర్మాత బి.సుధాకర్‌రెడ్డికి అందజేసారు. ఈ కార్యక్రమంలో శివాజీరాజా, ఏడిద శ్రీరామ్ తదితరులు పాల్గొని టీమ్‌ని అభినందించారు.
ఈ సందర్భంగా చిత్ర నిర్మాత సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘‘ఈ కథ వినగానే ఎంతో నచ్చింది. అన్ని కమర్షియల్ హంగులతో యూత్ మెచ్చే చిత్రమవుతుంది. వచ్చే వారం నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నాం’’ అని అన్నారు.
చిత్ర దర్శకుడు రామకృష్ణ మాట్లాడుతూ.. ‘‘ఈ బ్యాచిలర్ పార్టీ, పార్టీ లాగా ఉండదు. ఆద్యంతం సస్పెన్స్‌తో, యువతకు మంచి వినోదాన్ని అందించే యాక్షన్ ఎంటర్ టైనర్ మా బ్యాచిలర్ పార్టీ. సంగీతానికి మంచి స్కోప్ ఉన్న చిత్రమిది. ఆర్టిస్టుల పెరఫార్మెన్స్‌కు ఆస్కారం వున్న చిత్రమిది..’’ అని అన్నారు.
భూపాల్, అరుణ్, రమణా రెడ్డి, బెనర్జీ, కార్తిక్, రియా, గిరి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: అద్దంకి రాము, ప్రొడ్యూసర్స్: బి. సుధాకర్ రెడ్డి, డి.సుబ్బారావు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: డి. రామకృష్ణ.