Advertisement
Google Ads BL

‘డియర్ కామ్రేడ్’ నిర్మాతలకి లాభాలే లాభాలు


స్టార్ హీరోలతో సమానమైన క్రేజ్ తో విజయ్ దేవరకొండ క్రేజ్ యూత్ పాకిపోయింది. విజయ్ దేవరకొండకి స్పెషల్ ఫ్యాన్స్ ఉన్నారు. అర్జున్ రెడ్డితో యూత్ కి కనెక్ట్ అయిన విజయ్ గీత గోవిందంతో ఫ్యామిలీస్ కి కనెక్ట్ అయ్యాడు. అందుకే విజయ్ దేవరకొండ సినిమా సెట్స్ మీదున్నా.. ఆ సినిమాకి ఎనలేని క్రేజ్, అంచనాలు ట్రేడ్ లోను ప్రేక్షకుల్లోనూ ఉంటున్నాయి. గీత గోవిందం బ్లాక్ బస్టర్ తర్వాత విజయ్ సినిమాల మార్కెట్ వ్యాల్యూ బాగా పెరిగింది. అందుకే విజయ్ కూడా ఎడా పెడా సినిమాలేవీ ఒప్పుకోకుండా చాలా జాగ్రత్తగా సినిమాలు చేస్తున్నాడు. తాజాగా విజయ్ నటించిన డియర్ కామ్రేడ్ సినిమా విడుదలకు సిద్ధమవుతుండగా... ఆ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఊపందుకుంది.

Advertisement
CJ Advs

భరత్ కమ్మ అనే కొత్త దర్శకుడు దర్శకత్వంలో తెరకెక్కిన డియర్ కామ్రేడ్ సినిమా.. మొన్న వదిలిన టీజర్ తో సినిమా మీద భారీ  అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాని మైత్రి మూవీస్ వారు అలాగే విజయ్ దేవరకొండ చుట్టం యష్ రంగినేనిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మరి ఇప్పటికే బిజినెస్ స్టార్ట్ చేసిన డియర్ కామ్రేడ్ ని ఇద్దరు పార్టనర్ నిర్మాతలు ఎవరి వాటాని వాళ్ళు పంచేసుకున్నారట. సీడెడ్, నైజాం విజయ్ చుట్టమయిన యష్ రంగినేని వాటాకు రాగా... ఆంధ్రా మాత్రం మైత్రీ వాటాకు వచ్చింది. అయితే యష్ రంగినేని తన డియర్ కామ్రేడ్ సీడెడ్, నైజాం వాటాను 11 కోట్లకు నిర్మాత చదలవాడ శ్రీనివాసరావుకు అమ్మేసినట్లుగా సమాచారం.

ఇక నైజాం ఏరియాను మాత్రం ఏషియన్ సునీల్ కు అడ్వాన్స్ మీద డిస్ట్రిబ్యూషన్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఇక మైత్రి మూవీస్ వారు కూడా ఆంధ్రా హక్కులను 12 కోట్ల రేషియో పద్దతిలో మార్కెట్ చేసుకుంటుందట. ఆంధ్రా, నైజాం, సీడెడ్ కే 23 కోట్లు వస్తే.. దానితోపాటు డియర్ కామ్రేడ్ ఓవర్సీస్, కర్ణాటక, తమిళనాడు, కేరళ హక్కులన్నీ కలిపి ఓ 40 కోట్ల పైనే థియేట్రికల్ బిజినెస్ చేసేలా కనబడుతుంది. అలాగే డిజిటల్, శాటిలైట్ హక్కులు కూడా ఉన్నాయి. మరి అన్ని కలిపి డియర్ కామ్రేడ్ నిర్మాతలకు లాభాలే లాభాలు అన్నట్టుగా వుంది.

Dear Comrade Business Reached Near 50 Crores:

Producers Happy With Dear Comrade Business
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs