Advertisement
Google Ads BL

అతిలోక సుందరి ఆమె మాత్రమే: రకుల్


ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అయిన పసుపులేటి రామారావు రచించిన అతిలోక సుందరి శ్రీదేవి పుస్తకావిష్కరణ గ్లామర్ డాల్ రకుల్ ప్రీత్ సింగ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం మార్చి 20న హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్ లో సినీ ప్రముఖుల మధ్య యువకళావాహిని మరియు సీల్ వెల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో  ఘనంగా జరిగింది. సీల్ వెల్ కార్పొరేషన్ అధినేత బండారు సుబ్బారావు ప్రముఖ నిర్మాతలు బి.వి.ఎస్. ఎన్ ప్రసాద్, దిల్ రాజు, కె.అచ్చిరెడ్డి, దర్శకులు రేలంగి నరసింహారావు, వై.వి.యస్ చౌదరి, నటులు దర్శకులు ఆర్.నారాయణమూర్తి, మాదాల రవి. శివాజీ రాజా, ఏడిద శ్రీరామ్, బి.ఏ. రాజు, సురేష్ కొండేటి, ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మొదటి ప్రతిని మాదాల రవి అందుకోగా, శివాజీ రాజా తొలి ప్రతిని కొనుగోలు చేసారు. 

Advertisement
CJ Advs

హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ మాట్లాడుతూ.. అతిలోక సుందరి అనే బిరుదుకి శ్రీదేవి తప్ప మరెవరు సాటిరారు. అతి చిన్న వయసులోనే సినీ రంగ ప్రవేశం చేసి స్టార్ హీరోయిన్ అయ్యారు. అన్ని భాషల్లో నటించి అతిలోక సుందరిగా పాపులారిటీ, క్రేజ్ సంపాదించుకున్నారు. అలాంటి మహానటి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇండియాలో ఫస్ట్ సూపర్ స్టార్ హీరోయిన్ గా మోస్ట్ పాపులారిటీ నటిగా ఎదిగారు. అంతటి గొప్పనటి మన మధ్య లేకపోవడం బాధాకరం. ఆమె గురించి రామారావు గారు పుస్తకం రాయడం చాలా సంతోషంగా వుంది.. అన్నారు. 

Athiloka Sundari Sridevi Katha book Launch:

Rakul Preet Singh Launches Athiloka Sundari Sridevi Katha book
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs