Advertisement
Google Ads BL

అవతారపురుషుడు అంటే ఏంటో అనుకున్నాం?


ఓ వైపు ఎన్నికల వేడి మ‌రో వైపు రామ్‌గోపాల్ వ‌ర్మ్‌ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం వివాదాల వేడి. ఓటర్లను ప్రభావితం చేసేలా ఉన్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీ ఎలాగైనా అడ్డుకోవాలని తెలుగుతమ్ముళ్లు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. వీటిని ధీటుగా ఎదుర్కొనేందుకు వర్మ కూడా వ్యూహాలకు పదును పెడుతున్నారు. కాగా అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ మూవీ సెన్సార్‌కు రెడీ అయింది. అయితే సెన్సార్ బోర్డు క్లియరెన్స్ ఇస్తుందా అంటే సందేహాలు రాక మానవు. 

Advertisement
CJ Advs

మార్చి 22న ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సినిమాను విడుదల చేస్తానని వర్మ ధీమాగా చెబుతున్నారు. అయితే ఇంత వరకూ సెన్సార్ పూర్తి కాలేదు. ఒకవేళ ఏవైనా అభ్యంతరకరమైన సన్నివేశాలు, సంభాషణలు ఉంటే తొలగించడానికి సర్దుబాట్లు చేయడానికి మధ్యలో ఒక్క రోజు సమయం ఉంటుంది. అయితే ఖచ్చితంగా సెన్సార్ నుండి ఈ సినిమాకు అభ్యంతరాలైతే ఉండనే ఉంటాయి. ఈ లెక్కన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ఒకటి రెండు రోజులు పాటు వాయిదా పడే అవకాశం లేకపోలేదు. ఇదిలా ఉంటే అసలు ఈ సినిమా విడుదలౌతుందా లేదా అన్న సందిగ్ధత ఉంటే.. వర్మ మాత్రం తన ప్రమోషన్స్ మంత్రాన్ని ఎక్క‌డా ఆప‌డం లేదు.

తాజాగా నందమూరి తారకరామారావు గారి పాపులర్ ఫొటోని మార్ఫింగ్ చేసి అన్నగారి ఫేస్‌కి బదులుగా వర్మ ఫొటో పెట్టేసుకున్నాడు. ఇది ఆయన ఫ్యాన్స్ పంపారో లేక ఆయన దర్శకత్వ ప్రతిభనో తెలియదు కాని.. ‘ఎన్టీఆర్ లుక్ ఒకర్ని పోలినట్టు ఉంది.. అతనెవరో మీకు తెలుసా?’ అంటూ ఈ మార్ఫింగ్ ఫొటోకి క్యాప్షన్ కూడా పెట్టేశారు. పోల్చుకుంటే పోల్చుకోవచ్చుగాని.. మరీ ఎన్టీఆర్‌తో పోల్చుకోవడం ఏంట‌ని ఎన్టీఆర్ అభిమానులు తలలు పట్టుకుంటున్నారు.

Varma Turns NTR for Lakshmis NTR Promotion:

Varma Morphed Pic Sensation in Social Media
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs