Advertisement
Google Ads BL

చివరికి తమన్నా విలన్ అవుతుంది


కెరీర్ పరంగా నటి తమన్నా స్లోగా ఉంది. అవకాశాలు తక్కువ అవ్వడంతో ఇంకా తమన్నాకు సినిమాలు రావేమోనని అనుకున్నారు. కానీ అందరిని సప్రైజ్ చేస్తూ వరస సినిమా అవకాశాలతో దూసుకుపోతుంది తమన్నా. ఈ ఏడాది స్టార్టింగ్ లో వచ్చిన ఎఫ్ 2 చిత్రం బ్లాక్ బస్టర్ తో ఫుల్ జోష్ లో ఉన్న తమన్నా ప్రస్తుతం ‘దేవీ-2’.. ‘దటీజ్ మహాలక్ష్మి’ సినిమాలలో నటిస్తోంది.

Advertisement
CJ Advs

అలానే సైరాలో ఒక కీలక పాత్ర చేస్తోంది. ఇవి కాకుండా విశాల్ సినిమాలో చేసే ఛాన్స్ కొట్టేసింది. తమన్నా ఈ సినిమాలో అటువంటి ఇటువంటి పాత్ర కాదు చేసేది. ఇందులో విలన్ పాత్రలో నటిస్తోందని సమాచారం. విశాల్ తో మైండ్ గేమ్ ఆడే పాత్రలో నటిస్తుందట. తమన్నా ఇప్పటివరకు ఇటువంటి పాత్రలో నటించలేదు. ఇదే మొదటిసారి.

విశాల్ సినిమాలో తమన్నా విలన్ గా చేయడానికి ఒక కారణం ఉంది. విశాల్ సినిమాల్లో లేడీ విలన్ పాత్రలు సూపర్ హిట్ అయ్యాయి. ‘పొగరులో శ్రియా రెడ్డి, పందెంకోడి 2 లో వరలక్ష్మి, డిటెక్టివ్ చిత్రంలో ఆండ్రియా’ పాత్రలు ఎంత హైలెట్ అయ్యాయో ఈ చిత్రంలో తన పాత్ర కూడా అంతే అవుతుందని భావిస్తుంది. అందుకే వెంటనే ఓకే చేసిందని టాక్. విశాల్ తో తమన్నాకు ఇది మూడవ సినిమా.

Tamanna as villain in the Next Movie :

Tamanna going to try lady villain character in vishal movie
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs