Advertisement
Google Ads BL

టాలీవుడ్‌లో నటులే లేరా రాజమౌళి


ఎన్టీఆర్, రామ్ చరణ్ లు టాలీవుడ్ లో టాప్ రేంజ్ హీరోలు. ఒకరికొకరు పోటీపడగల సత్తా ఉన్న స్ట్రాంగ్ హీరోలిద్దరూ. కానీ వీరికి తెలుగు తర్వాత తమిళంలోనూ ఫాలోయింగ్ బాగా ఉంది. కానీ సౌత్ లో ఉన్న క్రేజ్ వీరికి బాలీవుడ్ లో అయితే లేదు. ఇంకా రామ్ చరణ్ అన్నా జంజీర్ తో బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు కానీ.. ఎన్టీఆర్ కి అసలు బాలీవుడ్ పరిచయమే లేదు. ఇక చరణ్ జంజీర్ దెబ్బకి మళ్ళీ బాలీవుడ్ వైపు చూడలేదు. తాజాగా ఎన్టీఆర్, చరణ్ లు ఇప్పుడు RRR మూవీతో అన్ని భాషల్లోకి అడుగుపెడుతున్నారు. బాహుబలితో నేషనల్ వైడ్ క్రేజ్ సంపాదించిన రాజమౌళి ఇప్పుడు ఈ టాలీవుడ్ హీరోలతో RRR సినిమాతో మరోసారి నేషనల్ వైడ్ గా కొట్టాలని చూస్తున్నాడు.

Advertisement
CJ Advs

అయితే ఎన్టీఆర్, చరణ్ ల క్రేజ్ అన్ని భాషల్లోనూ సరిపోదని.. కేవలం తన బాహుబలి క్రేజ్ కూడా సరిపోదని గ్రహించిన రాజమౌళి RRR కోసం బాలీవుడ్ త్రయాన్ని దింపుతున్నాడు. ఇప్పటికే చరణ్ సరసన బాలీవుడ్ భామ అలియా భట్ ని తీసుకున్న రాజమౌళి.. మరో కీలక పాత్ర కోసం అజయ్ దేవగన్ ని ఎంపిక చేసుకుంటున్నాడు. ఇక అలియా భట్ కి భారీ పారితోషకం ఇచ్చుకోవాల్సి వచ్చినా RRR కోసం రాజమౌళి తగ్గడం లేదు. అలాగే అజయ్ దేవగన్ కూడా ఓ పట్టాన ఒప్పుకోకపోయినా.. ఎలాగో ఒప్పించి తీసుకొచ్చాడు. 

ఇక తాజాగా  బాలీవుడ్ నటులను మరికొంతమందిని రాజమౌళి RRR కోసం తీసుకుంటున్నాడని టాక్ నడుస్తుంది. కాస్త పేరున్న బాలీవుడ్ నటుల కోసమే రాజమౌళి తిప్పలు పడుతున్నాడట. RRR లో మరో ముఖ్య పాత్రల కోసం నటుడు సంజయ్‌ దత్‌ తో పాటుగా యంగ్‌ హీరో వరుణ్‌ ధావన్‌ కూడా తీసుకోవాలని రాజమౌళి ఆలోచన అంటున్నారు. అందుకోసమే తన బాహుబలి మిత్రుడు కరణ్ జోహార్ తో కలిసి వారిని ఒప్పించేందుకు ప్రయత్నాలు మొదలెట్టినట్టుగా ఫిలింనగర్ టాక్.

Sanjay Dutt, Varun Dhawan in RRR:

Bollywood Power Doubles In RRR    
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs