Advertisement
Google Ads BL

‘పరుగు...పరుగు’ అంటోన్న తేజు!


వరసగా రెండు హ్యాట్రిక్‌ డిజాస్టర్స్‌ రావడం వల్ల అయితేనేమీ మెగామేనల్లుడు సాయిధరమ్‌తేజ్‌ కాస్తా తన పేరును సాయితేజ్‌ గా మార్చుకున్నాడు. మరి ఇది న్యూమరాలజీ ఎఫెక్టో లేక మరేదైనా సెంటిమెంటో అయి ఉంటుంది. గతంలో పవన్‌కళ్యాణ్‌ కూడా మొదట కళ్యాణ్‌బాబుగా వచ్చాడు. కానీ చివరికి తమ కుల దైవం ఆంజనేయ స్వామి పేరుకి మారుపేరైన పవన్‌ని ముందు చేర్చుకుని పవన్‌కళ్యాణ్‌ పేరుతో పాపులర్‌ అయ్యాడు. ఇప్పుడు అందరు ఆయన్ను పవన్‌ అనే అంటూ ఉంటారు. ‘పవనిజం’ అనే పేరుతోనే ఆయన పాపులర్‌ అయ్యాడు. 

Advertisement
CJ Advs

ఇక విషయానికి వస్తే సాయితేజ్‌ ప్రస్తుతం కిషోర్‌ తిరుమల దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్‌ బేనర్‌లో ‘చిత్రలహరి’ చిత్రం చేస్తున్నాడు. ఈ చిత్రం టీజర్‌ విడుదలైన తర్వాత ఈ మూవీపై అంచనాలు బాగా పెరిగాయి. దురదృష్టం వెంటాడే యువకునిగా, చిత్ర, లహరి అనే అమ్మాయిల ప్రేమ మధ్య నలిగిపోయే హీరోగా ఇందులో సాయి కనిపిస్తాడని సమాచారం. ఇంతవరకు తనదైన అతి పాత్రను చేసి మెప్పించిన పోసాని కృష్ణమురళి ఇందులో సౌమ్యుడైన తండ్రి పాత్రలో నటిస్తున్నాడని అంటున్నారు. ఇందులో హీరోయిన్లతో లవ్‌తో పాటు నిరుద్యోగ యువకుని బాధలు, తండ్రి కొడుకుల మధ్య ఉండే ఎమోషన్స్‌ అద్భుతంగా ఉంటాయని అంటున్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత రోజున అంటే ఏప్రిల్‌ 12న ఈ మూవీ విడుదల కానుంది. వరుసగా డబుల్‌ హ్యాట్రిక్‌ డిజాస్టర్స్‌ వచ్చినా కూడా ఈ చిత్రం విడుదల ఇంకా మూడు వారాలు ఉండగానే థియేటికల్‌ బిజినెస్‌తో పాటు అన్ని పూర్తవ్వడం విశేషం. 

థియేటికల్‌ రైట్స్‌తో పాటు మొత్తంగా 25 కోట్ల వరకు బిజినెస్‌ జరిగినట్లు సమాచారం. ఇది నిజంగా గ్రేటేనని చెప్పాలి. ఇక ఈ చిత్రం నుంచి మొదటి లిరికల్‌ ఆడియో విడుదలైంది. దేవిశ్రీప్రసాద్‌ సంగీత సారధ్యం వహించిన ఈ చిత్రంలోని ‘పరుగు.. పరుగు... పరుగు... వెళ్తున్నా ఎటో వైపు జరుగు జరుగు జరుగు.. అంటోందే లైఫ్‌.. ఎంత పెంచుకుంటున్నా నా వేగం... నన్ను దాటి వెళ్తోందో లోకం’ అంటూ క్యాచీ పదాలతో సాగిన సాహిత్యం బాగా ఆకట్టుకుంటోంది. ఇక ఈ చిత్రంలో సాయితేజ్‌ మరో సెంటిమెంట్‌ను నమ్ముకుంటున్నాడు. మెగా హీరోలైన చిరంజీవి ‘గ్యాంగ్‌లీడర్‌’లో, నాగబాబు ‘రాక్షసుడు, మరణమృదంగం’ చిత్రాలలో, రామ్‌చరణ్‌ ‘రంగస్థలం’, వరుణ్‌తేజ్‌ ‘తొలిప్రేమ’ సెకండాఫ్‌లో, అల్లుఅర్జున్‌ ‘ఆర్య’లో గుబురు గడ్డంతో కనిపించి హిట్స్‌ కొట్టారు. మరి ‘చిత్రలహరి’లో సాయితేజ్‌ కూడా గుబురు గడ్డంతో కనిపిస్తున్నాడు. మరి ఈయనకు కూడా ఈ చిత్రం కలిసి వచ్చి హిట్టవుతుందో లేదో వేచిచూడాల్సివుంది...! 

Click here for Parugu Parugu song from Chitralahari:

Chitralahari Parugu Parugu Song Report:

Chitralahari Parugu Parugu Song Review  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs