Advertisement
Google Ads BL

ఇదంతా రాజమౌళి స్కెచ్చా..?


రాజమౌళికి తన సినిమాల మీద ప్రేక్షకుల్లో క్రేజ్ ఎలా పెంచాలి.. హైప్ ఎలా క్రియేట్ చెయ్యాలో బాగా తెలుసు. బాహుబలి సినిమా విషయంలో రాజమౌళి పబ్లిసిటీ పక్కాగా వర్కౌట్ అయ్యింది. ఆ సినిమాలో కీలక పాత్రలు చేసిన నటుల పుట్టిన రోజులకు, స్పెషల్ పోస్టర్ ని డిజైన్ చేయించి... అన్ని భాషల్లో వదులుతూ బాహుబలి సినిమా మీద అందరిలో అంటే తెలుగు, తమిళ, బాలీవుడ్ భాషల్లో ఆసక్తిని క్రియేట్ చెయ్యడమే కాదు... విడుదల సమయానికి సినిమా మీద పిచ్చ క్రేజ్ తెచ్చేసాడు. తాజాగా RRR విషయంలోనూ రాజమౌళి తన పబ్లిసిటీ స్ట్రేటజీని మొదలు పెట్టేసాడు. ఇప్పటికే RRR ప్రెస్ మీట్ తో భారీ హైప్ క్రియేట్ చేసిన రాజమౌళి.. ఇపుడు RRR టైటిల్ విషయంలోనూ అందరిలో అంతే క్రేజ్ క్రియేట్ చేస్తున్నాడు. RRR లెటర్స్ మీదే సినిమా టైటిల్ ఉండాలంటూ.. ఎన్టీఆర్, చరణ్ అభిమానులతో పాటుగా... ప్రేక్షకులందరిని ఈ టైటిల్ విషయంలో ఇన్వాల్వ్ చేస్తున్నాడు.

Advertisement
CJ Advs

అయితే రాజమౌళి ముందుగానే RRR టైటిల్ పెట్టేసాడని.. కేవలం తన సినిమా పబ్లిసిటీ స్టంట్ లో భాగంగానే ఈ RRR టైటిల్ ని చెప్పమంటూ అందరిలో ఆసక్తిని క్రియేట్ చేస్తున్నాడని అంటున్నారు. ఇక అభిమానులు కాదు.. చాలామంది సినిమా లవర్స్ ఈ RRR టైటిల్ గా ర‌ఘుప‌తి రాఘ‌వ రాజారాంకి ఓటేస్తున్నారని అంటున్నారు. ఒకవేళ రాజమౌళి కూడా ర‌ఘుప‌తి రాఘ‌వ రాజారాం టైటిల్ ని RRR కి పెడితే.. ఆ టైటిల్ అన్ని భాషలకు సరిపోతుందని.. ఒక్కో భాషకి ఒక్కో టైటిల్ పెట్టే బాధ లేదంటున్నారు. మరి నిజంగానే బాహుబలిలా... అన్ని భాషలకు ఒకే టైటిల్ అయితే... ఎలాంటి ఇబ్బంది ఉండదు. నేషనల్ వైడ్ ప్రమోషన్స్ కి కూడా ఒకే టైటిల్ అయితే... మరింత సులువు అవుతుంది.. ప్రేక్షకుల్లో బాగా నానుతుంది. 

ఇకపోతే రాజమౌళి సినిమా కథ ప్రిపేర్ చేసినప్పుడే.. టైటిల్ ని సెట్ చేసాడని... కాకపోతే ప్రేక్షకుల నుండి టైటిల్ తీసుకుని దాన్నే ఫిక్స్ చేసినట్టుగా... టైటిల్ విషయంలోనే ప్రేక్షకుల్లోకి RRR ని మరింతగా తీసుకెళ్లొచ్చనే ప్లాన్ తోనే రాజమౌళి ఈ టైటిల్ ని ప్రేక్షకులకు అప్పచెప్పాడంటున్నారు. కాకపోతే చివరికి రాజమౌళి సెట్ చేసిన టైటిల్ ఫిక్స్ చేస్తారనే టాక్ ఉంది.

Rajamouli Sketch For RRR Movie :

Already Rajamouli Fixed RRR Movie Title Full Form
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs