Advertisement
Google Ads BL

అందుకే ‘చీకటి గదిలో..’ టైటిల్ పెట్టాం: హీరో


ఆడియెన్స్ ని ఎంటర్ టైం చేయడమే ముఖ్యం - హీరో అరుణ్ ఆదిత్ 

Advertisement
CJ Advs

కథ, వీకెండ్ లవ్, ఎల్ 7, 24 కిస్సెస్ చిత్రాలతో తెలుగు  ప్రేక్షకుల మదిలో సుస్థిర స్థానం సంపాదించుకున్న నటుడు అరుణ్ ఆదిత్. తాజాగా అయన చీకటి గదిలో చితక్కొట్టుడు మూవీతో వస్తున్నారు ఈ చిత్రం ఈనెల 21 న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ట్రైలర్ తో సెన్సేషన్ సృష్టించిన  చీకటి గదిలో చితక్కొట్టుడు చిత్రంపై మంచి ఎక్స్పెక్టేషన్స్ వున్నాయి. అడల్ట్ కంటెంట్ తో తెరకెక్కిన ఈ చిత్రానికి సోషల్ మీడియాలో 11 .6 మిలియన్ వ్యూస్ వచ్చాయి. మార్చి 21న విడుదలకానున్న సందర్భంగా ఈ సినిమా హీరో ఆదిత్ అరుణ్ మీడియాతో మాట్లాడారు.

హారర్ కామెడీ స్టోరీ!!

చీకటి గదిలో అనే టైటిల్ ఈ చిత్రానికి కరెక్ట్ గా సరిపోద్ది. హారర్ కామెడీ స్టోరీ కాబట్టి ఆ టైటిల్ పెట్టాం. కానీ సినిమాలో డబుల్ మీనింగ్స్ డైలాగ్స్ , వోకల్ కామెడీ తప్ప ఫీజికల్ గా అసభ్యకరంగా అయితే ఉండదు. ఒక అబ్బాయి పెళ్లి కోసం అమ్మాయిని వెతుకుతూ ఉంటాడు ఆ క్రమంలో ఎలాంటి సంఘటనలు ఎదురుకున్నారు అనే నేపథ్యంలో ఉంటుంది. సినిమా చూసి చాలా నవ్వుకుంటారు.

తక్కువ సమయంలో కంప్లీట్ !!

నా కెరీర్ లో అతి తక్కువ సమయంలో కంప్లీట్ చేసిన సినిమా ఇదే. ఈ చిత్రానికి కేవలం 19 రోజులు మాత్రమే తీసుకున్నాను. చాలా మంది ఈ సినిమా డబ్బులు కోసం చేసావా అని అడుగుతున్నారు. మనీ కోసం కాదు సినిమా స్టోరీ బాగా నచ్చింది. ఈ చిత్రం చేస్తున్నప్పుడు బాగా ఎంజాయ్ చేశా. కొన్ని సినిమాలు ఆడుతాయి. కొన్ని ఆడవు. నేను సక్సెస్ ల గురించి ఆలోచించను. మంచి సినిమా చేశామా లేదా, చేస్తుంది కరెక్ట్ గా చేశామా అని మాత్రమే ఆలోచిస్తాను. ఇండస్ట్రీలో నా ఏజ్ వున్నవారు కొందరు ఇప్పటికి సినిమాలు లేక ఖాళీగా వున్నారు. అలాగని సక్సెస్ అవసరం లేదని చెప్పను.

ఫ్రెండ్షిప్ నేపధ్యలో ఓ సినిమా !!

ప్రస్తుతం డ్యూడ్ అనే చిత్రాన్ని చేస్తున్నాను. ఫ్రెండ్షిప్ నేపథ్యంలో ఉంటుంది. ఈ సినిమాలో నాతో పాటు ప్రిన్స్ , ప్రియదర్శి కూడా నటిస్తున్నారు. ఆల్ మోస్ట్ యాభై శాతం షూటింగ్ పూర్తి అయింది. ఇవి గాక మరో రెండు చిత్రాలకు సైన్ చేశాను. వాటి వివరాలు త్వరలో తెలియజేస్తాను అంటూ చీకటి గదిలో చితక్కొట్టుడు చిత్రం సక్సెస్ పై కాన్ఫిడెంట్ గా వున్నారు హీరో అరుణ్ ఆదిత్. 

Hero Arun Adith Interview About Chikati Gadhilo Chitakkottudu:

Arun Adith talks About Chikati Gadhilo Chitakkottudu
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs