Advertisement
Google Ads BL

మా జెస్సీ అందరినీ అలరిస్తుంది... నిర్మాత శ్వేతా సింగ్


అర్చన, ఆషిమా నర్వాల్ ప్రధాన పాత్రల్లో అశ్వనీకుమార్ దర్శకుడిగా ఈక ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై శ్వేతా సింగ్ నిర్మించిన సైకాలాజికల్ హార్రర్ చిత్రం జెస్సీ. ఇటీవల విడుదలైన ఈ చిత్రం మంచి ఓపెనింగ్స్ సాధించి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్బంగా చిత్ర యూనిట్ హైదరాబాద్ లో సక్సెస్ మీట్ ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో హీరోయిన్స్ అర్చన, ఆషిమా నర్వాల్, దర్శకుడు అశ్వనీకుమార్. వి, నిర్మాత శ్వేతా సింగ్, సంగీత దర్శకుడు శ్రీచరన్ పాకాల, నటుడు విమల్ పి.వి.ఆర్ పిక్చర్స్ ఉదయ్ తదితరులు పాల్గొన్నారు...

Advertisement
CJ Advs

దర్శకుడు అశ్వనీకుమార్ మాట్లాడుతూ... ఈ సినిమా రిలీజ్ టైంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నాం. పివిఆర్ ఉదయ్ మా సినిమా చూసి కాన్ఫిడెంట్ గా రిలీజ్ చేశారు. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ చాలా బాగుంది అని అప్రిషియేట్ చేస్తున్నారు. కొత్త కాన్సెప్టుతో సినిమా వస్తే తప్పక ఆదరిస్తామని ప్రేక్షకులు మా చిత్రంతో మరోసారి ప్రూవ్ చేశారు...అన్నారు. 

నిర్మాత శ్వేతా సింగ్ మాట్లాడుతూ... మా టీమ్ పడిన కష్టానికి మంచి ప్రతిఫలం దక్కింది. ఈ సినిమా రిలీజ్ అవడానికి మాకు సహకరించిన ఉదయ్ కి థాంక్స్.  సైకాలాజికల్ హారర్ చిత్రంగా రూపొందిన ఈ చిత్రాని ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు. అన్నారు.

ఆషిమా నర్వాల్ మాట్లాడుతూ... థియేటర్ లో ఆడియెన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. అన్ని చోట్ల నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ అవకాశం ఇచ్చిన  దర్శక నిర్మాతలకు థాంక్స్ అన్నారు. 

అర్చన మాట్లాడుతూ... కొత్త కథలతో సినిమాలు వస్తే ఆదరిస్తామని ఆడియెన్స్ జెస్సీ తో ప్రూవ్ చేశారు. మంచి క్యారెక్టర్ ఇచ్చారు దర్శకుడు. హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది..అన్నారు.

Jessie Movie Success Celebrations:

Jessie Movie Success Meet
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs