Advertisement
Google Ads BL

ముద్దుతో మళ్లీ ట్రోల్ అవుతున్న రష్మిక!


కన్నడ నుండి కిర్రాక్ పార్టీతో ఒక్కసారిగా ఫేమస్ అయిన రష్మిక మందన్న తెలుగులోకి మాత్రం ఒక యంగ్ అండ్ మీడియం హీరోతో ఎంట్రీ ఇచ్చింది. నాగ శౌర్యతో కలిసి నటించిన ఛలో సినిమాలో బడ్జెట్ గా తెరకెక్కి అదిరిపోయే కలెక్షన్స్ తో అదరగొట్టేసింది. దానితో రష్మికకి రెండో సినిమాకే విజయ్ దేవరకొండ లాంటి స్టార్ పక్కన ఛాన్స్ లభించింది. విజయ్ - రష్మిక జంటగా వచ్చిన గీత గోవిందం కూడా లో బడ్జెట్ తో తెరకెక్కి అద్భుతాలు సృష్టించడమే కాదు.. బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఆ సినిమా హిట్ అయ్యాక రష్మిక తాను కన్నడ హీరో రక్షిత్ తో చేసుకున్న నిశ్చితార్ధాన్ని రద్దు చేసుకుంది.

Advertisement
CJ Advs

కారణం రష్మిక కెరీర్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తూ పెళ్లి వద్దనుకుందని అన్నారు. తర్వాత రక్షిత్ తో వచ్చిన విభేదాల వలనే రష్మిక పెళ్లి రద్దు చేసుకుంది అన్నారు. ఈ విషయమై రక్షిత్ పెద్దగా స్పందించలేదు. కానీ రక్షిత్ ఫ్యాన్స్ మాత్రం రష్మికకు రెండు హిట్స్ పడగానే మారిపోయిందని.. రక్షిత్ తో కావాలని ఎంగేజ్మెంట్ రద్దు చేసుకుందని కక్ష కట్టారు. ఇక గీత గోవిందం సినిమాలో విజయ్ తో లిప్ లాక్ చేసిన రష్మికకి కన్నడ రక్షిత్ అభిమానుల నుండి బెదిరింపులు, ట్రోలింగ్ వచ్చేసరికి.. ఆ సినిమాలో ఆ లిప్ లాక్ సీన్ ని ఎడిట్ చేసినా.... అది మాత్రం సామజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది.

ఇక రక్షిత్ తో బ్రేకప్ తర్వాత తెలుగులో బాగా బిజీ అయిన రష్మిక ప్రస్తుతం విజయ్ దేవరకొండతో డియర్ కామ్రేడ్ సినిమాలో నటిస్తుంది. అలాగే తమిళంలోకి కూడా ఎంట్రీ ఇచ్చిన ఈ భామని రక్షిత్ ఫ్యాన్స్ మాత్రం వదలడం లేదు. కారణం నిన్న విడుదలైన డియర్ కామ్రేడ్ సినిమా టీజర్. ఆ టీజర్ లో విజయ్ దేవరకొండ రష్మికతో చేసిన లిప్ లాక్ కారణం. విజయ్ కి గాఢమైన లిప్ కిస్ ఇచ్చిన రష్మికని మళ్ళీ కన్నడ హీరో రక్షిత్ ఫ్యాన్స్ ట్రోలింగ్ చెయ్యడం.. రష్మికని సోషల్ మీడియాలో దూషించడం చేస్తున్నారు. మామూలుగానే ఫేమస్ అవడంతో రక్షిత్ కి హ్యాండ్ ఇచ్చిందంటూ రష్మికను ఆడుకున్న రక్షిత్ ఫ్యాన్స్ ఇప్పుడు.. విజయ్ కి పెట్టిన ముద్దుతో మరింతగా రెచ్చిపోయి ట్రోల్ చేస్తున్నారు.

Dear Comrade Teaser: Kannada Fans Criticize Rashmika Mandanna:

EX BF Fans Slam Rashmika Mandanna!  
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs